Sunday, December 31, 2017

ఎత్తైన తలదిండ్లు వాడితే ఆరోగ్యానికి కలిగే హాని ఏంటి?

Image result for higher pillows
చాలా మందికి తలకింద దిండు లేనిదే నిద్రపట్టదు. ఇలాంటి వారు ఆ సమయానికి ఏదో ఒకటి ఎత్తును తల కింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు. అలాంటి వారు చిన్నపాటి అనారోగ్య ఇబ్బందులకు గురవుతుంటారు. అందువల్ల దిండ్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. తలదిండ్లు మరీ పలుచగా ఉన్నా.. మరీ ఎత్తుగా ఉన్న వెన్నుముకకి ఇబ్బంది కలుగుతుంది.

మరీ పల్చగా ఉన్న దిండ్లను వాడినా.. లేదంటే బాగా ఎత్తైన దిండ్లని ఎంచుకున్నా... వీటివల్ల వెన్నెముకకి ఇబ్బంది. దీర్ఘకాలం ఇలానే పడుకుంటే వెన్నెముక, మెడపై భారం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా, వెల్లకిలా, బోర్లా ఈ రెండూ నిద్రపోవడానికి సరైన విధానాలు కావు.. ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవడం మంచి పద్ధతి. బరువుని ఎత్తేటప్పుడు వంగిపోయి అమాంతం ఎత్తడం కూడా మనలో చాలామంది చేసేదే. దీనివల్ల నడుము పట్టేస్తుంది. అలా కాకుండా మోకాళ్ల మీద కూర్చుని నిదానంగా, అదును చూసుకుని ఎత్తాలి.

వేడినీటిలో స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవచ్చా?

Image result for hot water
వేడినీటిలో స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవడం.. ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయకూడదు. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే.. ఉదర భాగంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలి. అయితే వేడినీటిలో స్నానం చేశాక.. శరీరాన్ని చల్లబరిచేందుకు అధికరక్తం చర్మానికి చేరుతుంది. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేస్తే.. రక్త ప్రసరణ చేతులు కాళ్లు వంటి భాగాలకు చేరుతుంది. అందుచేత ఉదర భాగంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. తద్వారా తీసుకున్న ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. 
కాబట్టి స్నానం చేసిన అరగంట తర్వాత ఆహారం తీసుకోవాలి. అలాగే ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత స్నానం చేయాలి. ఆహారం తీసుకున్న వెంటనే పండ్లను తీసుకోకూడదు. ఇలా చేస్తే గ్యాస్‌‍తో పాటు అయోడిన్ శరీరంలో చేరుతుంది. అందుకే ఆహారం తీసుకున్న రెండు గంటలకు తర్వాతే పండ్లు తీసుకోవాలి. లేదా ఆహారం తీసుకోవడానికి గంట ముందు పండ్లు తీసుకోవచ్చు. 
ఇదేవిధంగా ఆహారం తీసుకున్న వెంటనే టీ తాగడం చేయకూడదు. ఇలా చేస్తే అధిక స్థాయిలో ఆమ్లాలను శరీరంలో చేర్చినవారవుతాం. తద్వారా అజీర్తి తప్పదు. ఆహారం తీసుకున్న తర్వాత పొగతాగకూడదు. తద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే ఆహారం తీసుకున్నాక బెల్టును వదులు చేయడం కూడదు. ఇలా చేస్తే.. తీసుకునే ఆహారం వేగంగా పేగులకు చేరుతుంది. తద్వారా జీర్ణ ప్రక్రియ సజావుగా సాగదు. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించకూడదు. తద్వారా కడుపులో గ్యాస్, బ్యాక్టీరియా చేరుతుంది.

గ్యాస్ సమస్య నుండి ఉపశమనానికి ఇలా చేయండి..

Image result for gas problem
జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరలు వాపునకు గురైనప్పుడు, పలు రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా లోనవడం వల్ల, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మద్యం సేవించడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలా వచ్చే గ్యాస్ సమస్యను పలు సింపుల్ టిప్స్ పాటించడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే గ్యాస్ సమస్య ఉండదు.
2. పుదీనా, చామంతి, రాస్ప్‌బెర్రీ రుచులలో ఉండే టీని తాగినా గ్యాస్ సమస్య బాధించదు.
3. పసుపు ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య ఇట్టే పోతుంది.
4. రోజూ ఉదయాన్నే పరగడుపున‌ 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
5. గ్యాస్ సమస్యకు అల్లం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. లేదంటే 1 టీస్పూన్ అల్లం రసం తాగినా చాలు. సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
6. ఆలుగడ్డలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. దీన్ని రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య రాదు.
7. భోజనానికి ముందు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగాలి. లేదంటే వాటి రసం తాగినా చాలు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
8. దాల్చినచెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. భోజనానికి ముందు ఈ నీటిని తాగితే గ్యాస్ రాదు.
9. భోజనం చేశాక 2, 3 యాలకుల్ని అలాగే నమిలి తిన్నా గ్యాస్ రాదు.
10. రోజూ ఏదో ఒక సమయంలో కొబ్బరినీళ్లను తాగుతుంటే గ్యాస్ రాకుండా ఉంటుంది.
11. ఒక గ్లాస్ వేడి నీటిలో 3 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది.
12. రోజూ మజ్జిగలో నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) కలుపుకుని తాగినా గ్యాస్ సమస్య బాధించదు.
13. కొద్దిగా కొత్తిమీర తీసుకుని దాన్నుంచి రసం తీసి ఆ రసం తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. కొత్తిమీరను నేరుగా తిన్నా సరే ఈ సమస్య రాదు.
14. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో నల్ల మిరియాల పొడి వేసుకుని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది.
15. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఇంగువను వేసి కలిపి తాగితే గ్యాస్ బారి నుంచి బయట పడవచ్చు.
16. భోజనం చేశాక సోంపు, లవంగాలు, వాము నమిలి మింగాలి. దీని వల్ల కూడా గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు.
17. రోజూ వేడి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే గ్యాస్ సమస్య రాదు. తిన్న ఆహారం జీర్ణం సరిగ్గా అవుతుంది.

Friday, December 29, 2017

ఎముకలు బలంగా ఉండాలంటే జొన్న రొట్టెలు తినాలి

Image result for jonna rotte
జొన్నలతో చేసే రొట్టెలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. అందుకే జొన్న పిండి, రవ్వ, గటక, అటుకలు.. ఇలా జొన్నలతో చేసిన ఎటువంటి ఆహారం తిన్నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో పాటుగా బాడీ ఎంతో స్ట్రాంగ్ గా మారుతుంది. జొన్న రొట్టెలు చేసుకుని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కింద తెలుసుకుందాం..
* బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నల్లో కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది.
* ఐరన్, ప్రోటీన్లు, పీచు పదార్థం వంటి బియ్యం, గోధుమల్లో దొరకని ఎన్నో పోషకాలు కేవలం జొన్నల్లోనే లభిస్తాయి.
* గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఫ్రీ ఆహారం జొన్న.
* ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి.
* శరీరంలో ఉండే చెడు కొవ్వుని తగ్గించే అరుదైన శక్తి జొన్న గింజల్లో ఉంది.
* ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నలతో పుష్కలంగా దొరుకుతుంది.
* నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు చాలా ఎక్కువగా ఉంది.
* జొన్న రొట్టెలు తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
* వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు జొన్న రొట్టె తినడం వల్ల తగ్గుతాయి.

మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండాలంటే?

మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండాలంటే?

Image result for kidneys
కొందరికి మూత్రానికి వెళ్తే మంట, మరికొందరికి మూత్రపిండాలలో ఇబ్బంది ఈ సమస్యలకు కారణం మీకు మూత్ర పిండాల సమస్య మొదలైదని అర్ధం. మనం చేసే అశ్రధ్ధ వల్లే ఈ సమస్య తెలెత్తుతుంది. మనం ఆచరించే అలవాట్లూ ఆహారమే వీటిపై ప్రభవం చూపిస్తాయి. మన మూత్రపిందాలు బాగుండాలతే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు. అవేంటో చూద్దమా..
1. మీ శరీరాన్ని శుభ్ర పరచేది నీరు మాత్రమే. కనుక, తగినన్ని ద్రవాలు తీసుకోవటం మీ కిడ్నీ లను శుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది.2. బ్లాక్ బీన్స్ మీ కిడ్నీల ఆరోగ్యానికి బ్లాక్ బీన్స్ తినటం మంచిది. వీటిలో ఫాస్ఫరస్ అతి తక్కువ అందువలన అవి కిడ్నీ లకు మంచిది.
3. తరచుగా మూత్రం పోయండి రోజులో ఎక్కువ సార్లు మూత్రం పోయటం కిడ్నీ ల ఆరోగ్యానికి మంచిది. అయితే ప్రతి సారి మీ మూత్రపు సంచి నిండి నిండి ఉందాలి.
4. నల్ల రంగు బెర్రీ లు దట్టమైన రంగులు కల ఆహారాలు సాధారణంగా మీ కిడ్నీలకు మంచిది. బ్లూ బెర్రీ లు, బ్లాక్ బెర్రీ లు, క్రాన్ బెర్రీ లు సిట్రస్ జాతికి చెంది అధిక అంటి ఆక్సిడెంట్ లు కలిగి ఉంటాయి. అవి కిడ్నీ సమస్యలను తొలగిస్తాయి.
5. కొత్తిమీర వాస్తవంలో మీ కిడ్నీలను శుభ్ర పరచేందుకు సహకరిస్తున్ది. కోరియందర్, పార్సిలీ , సిలాన్త్రో లు ఒకే జాతికి చెందినవి. ఇవి కిడ్నీల ఫిల్టర్ లను శుభ్ర పరుస్తాయి.
6. టేబుల్ సాల్ట్ లో కంటే సి సాల్ట్ లో సోడియం క్లోరైడ్ తక్కువ. కనుక మీరు కనుక కిడ్నీ రాళ్ళతో బాధ పడుతూంటే, సీ సాల్ట్ ఉపయోగించటం చాలా మంచిది.7. కారం కల మిర్చి తినటం కిడ్నీలకు మంచిది కాదు. అధిక మసాలా ఆహారాలు మీ లివర్, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి. కనుక మీ ఆహారంలో తగుమాత్రం కారాలు ఉండేలా చూసుకోండి.
8. సిగరెట్ లలో కాడ్ మియం అనే మెటల్ వుంటుంది. అది మీ కిడ్నీల లైనింగ్ లో డిపాజిట్ అవుతుంది . కిడ్నీల పనిని ఇది మందగిస్తుంది. రీనల్ ఫెయిల్యూర్ కు కూడా దోవ తీస్తుంది.
9. అరుగుల అనేది ఒక పచ్చని ఆకు కూర అది మీ కిడ్నీల లోని టాక్సిన్ లను బయటకు పంపుతుంది. అరుగుల కనుక రెగ్యులర్ గా తింటే కిడ్నీ సమస్యలతో బాధలు పడే వారికి మంచి రిలీఫ్ కలుగుతుంది.
10. మూత్రము ను ఆపు కొనవద్దు కొంతమందికి మూత్రంను ఎక్కువ సమయం ఆపుకొనే అలవాటు వుంటుంది ఇది చెడు అలవాతు. అది మీ కిడ్నీ లపై ఒత్తిడి కలిగిస్తుంది.11. మస్టర్డ్ గ్రీన్స్ ఆకు కూరలో విటమిన్ కె అధికం. ఇది కిడ్నీ లకు బ్లడ్ సరఫరా అధికం చేస్తుంది.
12. కిడ్నీ లను ఎలా సంరక్షించు కోవాలి అని మీరు ఒత్తిడికి గురవుతూంటే, ముందుగా మీరు కొంత రిలాక్స్ అవటం ఎంతో మంచిది. కిడ్నీలు డామేజ్ అయ్యేటందుకు ఒత్తిడి ఒక ప్రధాన కారణం. కనుక రిలాక్స్ అయి ఒత్తిడికి దూరంగా వుండి కిడ్నీలు బాగా పని చేసేలా చూసుకోండి.
13. రెడ్ కేబెజ్ మీకు కనుక డయాబెటిస్ ఉన్నట్లయితే మీ కిడ్నీలు వేగంగా చెడిపోయే అవకాశం వుంది. కేబెజ్ వంటి ఆకు కూరలు కిడ్నీల డామేజ్ ని అరికడతాయి
14. మీ కిడ్నీ లు సరిగ్గా మీ హిప్ ల పైన వీపు దిగువ భాగంలో వుంటాయి. కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ వ్యామాలు చేస్తే, కిడ్నీలు సవ్యంగా పని చేసే అవకాశం వుంటుంది .
15. అలసిన మీ శరీర కణాల పునరుజ్జీవానికి చక్కటి శరీర విశ్రాంతి అవసరం. కనుక బాగా నిద్రించండి. మీ ఇతర శరీర అవయవాల వలెనె, కిడ్నీ లు కూడా అధిక పని చేస్తే అలసి పోతాయి. కనుక ప్రతి రోజూ 8 గంటల పాటు తప్పక విశ్రాంతి తీసుకోండి.
16. యోగ లోని కొన్ని భంగిమలు కిడ్నీ లు సవ్యంగా పని చేసేలా చెస్తాయి. మీ కిడ్నీల మంచి పని తీరుకు క్రేన్, క్రేసేంట్ లున్గే భంగిమలు రెండూ బాగా పని చేస్తాయి.

Thursday, December 28, 2017

జలుబు దగ్గు నుంచీ విముక్తి పొందండిలా! – దగ్గు తగ్గడానికి చిట్కాలు

జలుబు దగ్గు నుంచీ విముక్తి పొందండిలా! – దగ్గు తగ్గడానికి చిట్కాలు

Image result for cold
వాతావరణం మారిందంటే చాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పు మొదలై ఎంతో సతమతమయ్యేలా చేస్తాయి. వీటి రాకతో మన శరీరం అంతా కంపించిపోయి అటు మింగలేక బయటకు కక్కలేక అన్న చందంలో పరిస్థితి మారుతుంది. అందుకే వీటిని అంటు వ్యాధులంటారు. వీటి నివారణకు మనం తీసుకునే ఆహారంలో స్వల్పంగా మార్పులు చేసి తీసుకుంటే వీటి బారిన పడకుండా ఉండటమే కాకుండా కాస్త ఉపశమనం పొందవచ్చు.
అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల బారినుంచి మనల్ని మీరు కాపాడుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీనికి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడమే ఏకైక ప్రాథమిక జాగ్రత్త.1.జలుబుతో బాధపడతున్నవారితో కలిసి పానీయాలు, లిప్‌స్టిక్‌లు, ఇతర వస్తువులను పంచుకోకూడదు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకుంటే క్రిములు నశిస్తాయి.
2.వర్షాకాలంలో రోజూ ఆరేడు సార్లు సబ్బుతో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా సాధ్యమైనంత వరకు కాపాడుకోవచ్చు.
3. పండ్లరసాలు, పండ్లసలాడ్‌లను సిద్ధం చేసుకున్న వెంటనే అప్పటికప్పుడే తీసుకోవాలి.
4. తాజాపండ్ల, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.
5. పెరుగు, మజ్జిగలను తాజాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.6. సాధ్యమైనంత వరకూ ఆహారాన్ని వేడివేడిగా తినాలి. పాత్రలపై మూతలు తప్పనిసరిగా పెట్టాలి.
7. ఆకుకూరలను కూడా ఒకటికి రెండుసార్లు కడిగి, బాగా ఉడకనిచ్చి ఆ తర్వాతే తినాలి.
8. జలుబు, దగ్గు తదితరాలకు పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ, బత్తాయి ఎంతో మేలు చేస్తాయి.
9. కర్బూజ, ఆఫ్రికాట్ల గుజ్జు, తాజా పెరుగును తీసుకోవాలి.
10.సూప్‌లలో కూరగాయలను ఎక్కువగా చేర్చాలి.
11.పుచ్చకాయ ముక్కలను నిత్యం తీసుకోవాలి.
12.మంచినీళ్లు, టమాట రసం తీసుకోవాలి. తాజా మొలకెత్తిన గింజలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
13.మాంసాహారం, కొవ్వుశాతం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. దీనివల్ల శాచురేటెడ్ కొవ్వు శాతం తగ్గుతుంది. జలుబు కారక క్రిములను నివారించే సి విటమిన్ నిమ్మకాయలో ఉంది కాబట్టి సమృద్ధిగా నిమ్మజాతిపండ్లను ఆరగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మధ్యాహ్నం భోజనం మానేస్తున్నారా..?

Image result for lunch1. మధ్యాహ్న భోజనం మానేయడంవల్ల జరిగే నష్టాలు..?
మధ్యాన్న భోజనాన్ని మానేస్తున్నారా..? పని ఒత్తిడి వల్లనో, లేక మధ్యాహ్నం భోజనం చేయడం వల్ల తరువాత నిద్ర వొచ్చే ప్రమాదం ఉందనో, లేక మరేదైనా కారణం వల్లనో  మధ్యాన్న భోజనం చేయకుండా చాలామంది దాటేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ సమయం ఆదా అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు. మధ్యాన్న భోజనం మానేయడం వల్ల శరీరం లోని చక్కెరల శాతం తగ్గి మెదడు చురుకుదనాన్ని కోల్పోతుంది. దాని వల్ల అరగంటలో పూర్తి చేయదగిన పనికి రెండు గంటలు వెచ్చించాల్సి ఉంటుంది.
2. మధ్యాహ్నభోజనం మానేయడం వల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటి..?
సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఒత్తిడి మరింత పెరిగి అసహనానికి గురౌతారు. అసిడిటీ వంటి జీర్ణవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.ఇది మాత్రమే కాదు. మధ్యాన్న భోజనాన్ని మానేయడం వల్ల శరీరానికి తగిన పోషణ అందని కారణంగా త్వరగా అలసి పోవడం. ఒళ్ళు నొప్పులు, చర్మం కాంతి విహీనం కావడం జుట్టు రాలడం వంటి సమస్యలు పెరుగుతాయి. మధ్యాన్నం భోజనం మానేయడం వల్ల తర్వాత తినేటప్పుడు  అవసరమైన దాని కన్నా ఎక్కువ తినే అవకాశం ఉంది దానివలన శరీరం లో కొవ్వు నిలువలు పెరిగి ఊబకాయం వస్తుంది.
3. మధ్యాహ్న భోజనం చేయడం వల్ల కలిగే లాభాలు..
మధ్యాహ్న సమయానికి శరీరానికి కార్బోహైడ్రేట్లు, ఇతరపోషకాలు అవసరమౌతాయి. సరిపడినంత ఆహారాన్ని సరైన సమయానికి శరీరానికి అందించడం వలన శరీరం చురుకుగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మిగిలిన రోజంతా సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ మధ్యాహ్న భోజనాన్ని నిర్లక్ష్యం చేయకండి.

సుఖమయమైన వృధ్ధాప్యం కోసం

Image result for old age
1. మీ సొంతఊరిలో, సొంత గడ్డ మీద నివసించండి... స్వతంత్రంగా జీవించడంలో కల ఆనందాన్ని పొందండి..
2. మీ బ్యాంకు బేలెన్స్ మరియు  స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉంచుకోండి.. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి.
3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు... ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా, చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. 
4. మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి...
5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి..
6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి.. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.. మీరు మీ తరహాలో జీవించండి.
7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలి అనో , లేదా, నా వయసు కారణం గా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి... 
8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి.
9. ప్రార్ధించండి కాని, అది భిక్షమెత్తుకుంటున్నట్టు ఉండకూడదు.... చివరికి భగవంతుని కూడా ఏమీ కోరుకోవద్దు.. దేవుణ్ణి ఏదైనా కోరుకున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ, లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి.
10. ఆరోగ్యం మీద శ్రధ్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితిననుసరించి, చక్కని పౌష్టికాహారం తీసుకోండి.. శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి..పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సహజమే...
11. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి... మీరు సంతోషంగా ఉంటూ, ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి.
12. ప్రతి సంవత్సరం మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూరు కు వెళ్ళిరండి.. దీనివలన జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది. 
13. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవటం నేర్చుకోంది... ఒత్తిడి  లేని జీవితాన్ని గడపండి.
14. జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు.. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు.. ఈ మాటను విశ్వసించండి..
15. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నిటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది  అసలైన స్వేచ్చతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోంdi

పిల్లలు పుట్టగానే.. వాళ్లకు ఉన్న బొడ్డు తాడుని కట్ చేసి.. పడేసేస్తారు. దీన్ని ఎందుకు పనికిరాని దానిగా భావించేవాళ్లు. కానీ.. ఇదే..

బేబీ స్టెమ్ సెల్ ( బొడ్డు తాడు ) 
Image result for boddu tadu in english
 పిల్లలు పుట్టగానే.. వాళ్లకు ఉన్న బొడ్డు తాడుని కట్ చేసి.. పడేసేస్తారు. దీన్ని ఎందుకు పనికిరాని దానిగా భావించేవాళ్లు. కానీ.. ఇదే.. ఇప్పుడు అనేక చికిత్సలకు మూలవస్తువుగా మారింది. ఎందుకు ? బొడ్డుతాడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి ?
 పిల్లల స్టెమ్ సెల్స్ స్టోర్ చేస్తున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే.. ఈ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయాలి అన్న విషయం తెలియని వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. బేబీ స్టెమ్ సెల్ ఎందుకు స్టోర్ చేయాలి ? ఎక్కడ స్టోర్ చేయాలి ? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలియని వాళ్లు ఉన్నారు.
భవిష్యత్లో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి స్టెమ్ సెల్స్ ఉపయోగపడతాయి. స్టెమ్ సెల్స్ అంటే.. బొడ్డు తాడును.. జీవితకాల అవసరాలకు దాచుకుంటారు. దీన్నే స్టెమ్ సెల్స్ అని పిలుస్తారు.
బొడ్డు తాడు
➰తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు (అంబిలికల్ కార్డె.) పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు (స్టెమ్ సెల్స్) పుష్కలంగా ఉంటాయి.
మూల కణాలు
ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి.
 నూతన కణాలకు ప్రాణం
దెబ్బతిన్న శరీర భాగాలను మూల కణాల సాయంతో బాగు చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. మూల కణాలను ఆయా శరీర భాగాల్లోకి ప్రవేశపెడితే తిరిగి అక్కడ నూతన కణాలు ఏర్పడి వ్యాధిని నయం చేస్తాయి.
అనేక వ్యాధులకు చికిత్స
ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే... షుగర్, బిపి నుంచి క్యాన్సర్ వరకూ వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాల నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా, తేలికగా బయటపడవచ్చు.
స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స
బట్టతల, వినికిడి సమస్యలు, షుగల్, స్ట్రోక్, పెద్ద పేగుల్లో వచ్చే సమస్యలు, రక్త నాళాల సమస్యలు, జ్ఞాపక శక్తి, మెదడుకు గాయాలు వంటి ఎన్నో సమస్యలకు స్టెమ్ సెల్ ద్వారా చికిత్స అందించవచ్చు.
*ఇంట్రా వీనస్ పద్ధతిలో*
ఒకవేళ శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే.. మూల కణాలను ఇంట్రా వీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకూ వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు.
80 రకాల వ్యాదులకు చికిత్స శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు తేల్చాయి.
ఇప్పటికే స్టెమ్ సెల్స్ తో చికిత్స
ఎయిడ్స్, అల్జీమర్స్, డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్ వ్యాధులు, మస్క్యులర్ డిస్ట్రోఫీ, పార్కిన్ సన్స్ వ్యాధి, మెదడు, వెన్నెముక గాయాలు, స్ట్రోక్, గర్భాశయ సమస్యలకు మూల కణాలతో చికిత్స చేయగా... సానుకూల ఫలితాలు వచ్చాయి.
✴*స్టెమ్ సెల్స్ మానవ శరీరంలో* అన్ని రకాల టిష్యూస్, అవయవాలు, వ్యవస్థలను మళ్లీ రీజనరేట్ చేయగలవు. ఇవి 200 రకాల టిష్యూలను పునరుత్పత్తి చేయగలుగుతాయి.
అవయవాలకు
ఒక్కో స్టెమ్ సెల్ ఎర్ర రక్త కణంగా, నరాల కణంగా, కండరాల కణంగా విడిపోగలుగుతుంది. పునర్ నిర్మించే సత్తా, రిపేర్ చేసే గుణం, డ్యామేజ్ అయిన కణాన్ని మళ్లీ పునర్ నిర్మించే సత్తా, అనారోగ్యానికి గురైన అవయవాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే సత్తా కలిగి ఉంటాయి..
ప్రపంచ వ్యాప్తంగా స్టెమ్ సెల్స్ ని 25 ఏళ్లుగా ఉపయోగిస్తూ.. 30 వేల ట్రాన్స్ ప్లాంట్స్ ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించాయి.
కుటుంబ సభ్యులకు చాలా తేలికగా మ్యాచ్ అవుతాయు. ఉదాహరణకు ఇతర వర్గాల ద్వారా స్టెమ్ సెల్స్ తీసుకోవాలంటే.. 6కి 6 శాతం కలవాలి. అదే బొడ్డు తాడు నుంచి తీసుకుంటే.. 6కి 4 శాతం మ్యాచ్ అయితే సరిపోతుంది.
 చాలా వేగంగా.. కణాలను పునరుత్పత్తి చేయగలుగుతాయి అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయడంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది

నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి

Image result for water
ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగేవారకన్న ...బాటిల్ మందు వేసేవారెక్కువగా తయారవుతున్నారు. మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే...దాహం వేసినప్పుడు తాగుతా అంటారు. కాని నిజానికి రోజు ఏసీ గదుల్లో ఉంటూ ఎంత మంది నీళ్లు తాగుతున్నారు ? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు... నీళ్లు తాగాలంటే బద్దకంగా ఫీలయ్యేవారందరి సమస్య. ఈ శరీరానికి నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.
1.మీరు కుర్చుని లేవలేక పోతున్నారా... కీళ్లు, కండరాలు నొప్పులతో అవస్తపడుతున్నారా...అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట. ఎందుకంటే.. కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల వస్తాయి..
2. తలనొప్పి తరచుగా వస్తుందా... నీళ్లు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తుంటుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం, బ్రెయిన్ కి బ్లడ్ తక్కువ అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది.
3. జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా, ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది.
4. అలసట ,ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా లేకపోవటం అనేవి తక్కువ నీరుకు సంబంధించినదే... బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయి అంటే.. మీరు శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం.
5. యూరిన్ కలర్ మీ శరీరం డీహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా.. మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి.
6. బ్రెయిన్ ఫంక్షన్ పైనా ఇది ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమరీ, డెసిషన్, ఏకాగ్రత వంటివాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.
7. పెదాలు ఆరిపోవడం , చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవటం, పొడిబారిపోవదటం. అలాగే చెమట కూడా చాలా తక్కువగా పట్టడం. ఇవే మీరు సరిగ్గా నీళ్లు తాగటం లేదని చెప్పే సంకేతాలు...ఇకనైనా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఇకపై ఈ సిగ్నల్స్ కనిపించిన వెంటనే నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి

happy new year welcome 2018 wishes

Wednesday, December 27, 2017

పరధ్యానం నుంచి బయటపడాలంటే

పరధ్యానం నుంచి బయటపడాలంటే

Image result for depression

పరధ్యానం అంటే?

మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అని మన పెద్దవాళ్ళూ, ఉపాధ్యాయులూ మనల్ని తిట్టటం తెలిసిందే. అయితే ఆ సామెతకు అర్థం మనిషిక్కడ, మనసక్కడ అని అర్థం. అయితే ధ్యానంలొ ఉంటే ఫర్వాలేదుగాని పరధ్యానంలో ఉంటేనే సమస్య. పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. ఈ సమస్యను చాలా మందిలో మనం చూస్తూనే ఉంటాం. అంతెందుకు మనమే ఒక్కోసారి అలా ప్రధ్యానంలో ఉండిపోతుంటం. ఆదేంటి నేను బాగా తెలివైనవాడినేనే నాకు అంతా బాగానే ఉంటుందే అని అనుకుంటున్నారా. తెలివితేటలు ఎక్కువైన వారికే ఎక్కువ ఈ సమస్య వస్తూ ఉంటుంది.
పరధ్యానానికి ఎన్నో కారణాలుంటాయి. వాటితో ఎన్నో సమస్యలూ వస్తాయి. వాటిని అధిగమించడాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.ఆఅ జగ్రత్తలేమిటో చుద్దామా..!పరధ్యానం అంటే ఏమిటి? మనిషి ఉన్న చోటే ఉండి, అతని ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉండటం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం కానట్టుగా ఉంటారు. దీని వల్ల ఎన్నో పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆలోచన, ఆచరణ ఒకేదానిపై కేంద్రీకరించినప్పుడు ఆ పని సఫలీకృతం అవుతుంది. అంతమాత్రాన పరధ్యానం మానసిక వ్యాధి అని చెప్పడానికి లేదు. కొంత మంది వ్యక్తితత్వం అలా ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే వ్యాధి రూపంలో ఒక లక్షణంగా ఉంటే ఉండొచ్చు. మామూలు వ్యక్తుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. పరధ్యానానికి వారు వీరు, వయసు తేడా ఏమీ లేదు.
పరధ్యానంగా ఉన్నవారిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదు. వీరు…సున్నిత స్వభావులై, కళాత్మక హృదయం కలవారై ఉంటారు. ఎక్కువగా ఊహల్లో విహరిస్తుంటారు. చిత్రకారులు, రైటర్లు.. ఈ కోవకు చెందుతారు. తాము చేయబోయే పనిని రకరకాలుగా ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, తమలో తాము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దైనందని జీవితంలో చుట్టుపక్కల వారిని పట్టించుకోరు. చాలా మెతకగా, నెమ్మదస్తులై ఉంటారు. రకరకాల కాంపిటిషన్స్‌లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని చూపరు. పైగా వీటికి చాలా దూరంగా ఉంటారు.ఎప్పుడూ మానసిక ప్రశాంతను కోరుకుంటారు. తమ భావాలను మరొకరితో పంచుకోవడానికి అంత ఉత్సాహం చూపరు. తక్కువగా మాట్లాడుతారు. ప్రతి ఒక్క విషయానికి ఇంకొకరిమీద ఆధారపడుతుంటారు. మెచ్యూర్డ్‌గా ఉండరు. సహజత్వానికి దూరంగా ఉంటారు.

పరధ్యానంగా వల్ల తలెత్తే సమస్యలు

1.నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో ఆ పని మైండ్‌లో రిజిస్టర్ కాదు.
2.ఇది పిల్లల్లో అయితే చదువులో వెనకబడేలా చేస్తుంది.3. పెద్దల్లో పనుల్లో లోపాలు, జాప్యం, కెరియర్‌లో ఎదుగుదల లేకపోవడం వంటి నష్టాలు సంభవిస్తుంటాయి.
4.సమస్యల నుంచి తప్పుకోవాలనుకుంటారు. ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు.
5.కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో దూరంగా ఉంటారు కనుక ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడతుంటారు.
6.వివాహ బంధంలో భాగస్వామితో త్వరగా సర్దుకుపోలేరు. ఎదుటి వ్యక్తి అంటే ఉండే భయం కారణంగా వివాహం కూడా వద్దనుకుంటారు.7.ఏదైనా వర్క్ విషయంలో ‘చేస్తాను’ అని మాట ఇచ్చి నిలుపుకోలేరు. దీంతో ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోతుంటారు.

ఈ సమస్యకు కారణాలు

1. వంశపారంపర్యం: తల్లిదండ్రుల్లో పరధ్యానం సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చే అవకాశం ఉంటుంది.
2. కుటుంబ వాతావరణ: ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలతో చులకనగా మాట్లాడటం. ‘నీకే పనీ చేతకాదు, ఓ చోట కూర్చో, నువ్వు సరిగ్గా చదవలేవు…’ వంటి పెద్దల మాటల ప్రభావం చిన్నతనంలో ఒంటరిగా ఉండేలా చేస్తుంది.
ఇంకొంతమంది పిల్లల్ని అతిగారాబం చేస్తుంటారు. తింటున్నా, కూర్చున్నా, నిల్చున్నా… ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భావంలో ఉంటారు. అన్నీ సజావుగా జరిగిపోవడంతో ఎప్పుడూ సౌకర్యాన్నే కోరుకుంటారు. తమకు అనుగుణంగా లేనప్పుడు త్వరగా మూడీ అయిపోతారు. ఇవి రకరకాల ఆలోచనలను కలిగిస్తాయి.
3. పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు (ఎమోషనల్ ప్రాబ్లమ్స్), అతిగా ఆలోచిస్తున్నప్పుడు కూడా పరధ్యానం వస్తుంటుంది.
4. పెద్దవారిలో పర్సనాలిటీ డిసార్డర్స్, మేజర్ డిప్రెషన్ డిసార్డర్స్ వల్ల మనసు దిగులుగా, దుఃఖంగా ఉండటం, తమను తాము తక్కువగా అంచనా వేసుకొని వాళ్లలో వాళ్లు లీనమైపోతారు.స్కిజోఫ్రీనియో: ఇది తీవ్రతరమైన మానసిక జబ్బు. వ్యక్తి తన ఆలోచనల్లో తాను ఉండిపోతాడు. చుట్టుపక్కల వాతావరణం అంతా బాధాకరంగా అనిపిస్తుంటుంది. అందరూ బాధపెట్టేవారుగానే కనిపిస్తారు. రకరకాల అనుమానాలు పెట్టుకుంటారు. తమ ముందు ఎవరూ లేకున్నా, ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటారు.
మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు అలవాటైన వారు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఉంటారు. మందుల ప్రభావం వల్ల, వ్యసనం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.
మల్టీటాస్కింగ్ : ఒకేసారి రకరకాల పనులు చేసేవారిలో అయోమయం నెలకొంటుంది.
వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగాలు.. ఎన్నో రకాల పనులు పెట్టుకునేవారిలో ఈ సమస్య ఉంటుంది. దీని వల్ల తప్పులు దొర్లుతుంటాయి. ఏకాగ్రత లోపిస్తుంది.స్ర్తీలు- ఇంటి పనులు, పిల్లల పనులు, ఉద్యోగినులైతే ఆఫీస్ పనులు. ఇలా ఒక పని తర్వాత మరో పని పెట్టుకొనే వారు, పనులను ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోనివారు పరధ్యానంగా కనిపిస్తుంటారు. దీంతో ‘మర్చిపోతున్నాం’ ‘మతిమరుపు మూలంగా ఏ పనీ చేయలేకపోతున్నాం’ అని తిట్టుకుంటూ ఉంటారు. కాని ఇది మతిమరుపు కాదు, పరధ్యానం వల్ల కలిగే సమస్య.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే

1. ఇష్టమైన పనులు చేయాలి. వారం మొత్తం ఏమేం పనులు చేశామో వారాంతంలో గుర్తుచేసుకొని బుక్‌లో రాసుకోవాలి.
2. ఏకాగ్రత కుదరడానికి, సోషల్ స్కిల్స్‌లో ప్రావీణ్యానికి శిక్షణ తీసుకోవాలి.
3. పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.
4. సమయానుకూలంగా పనిని విభజించుకొని దానికి తగినట్టుగా పనులు చేసుకోవాలి.
5. అదేవిధంగా ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా రాసుకోవాలి. అనుకున్న పని పూర్తవగానే టిక్ పెట్టుకోవాలి.
6. ఏకాగ్రత పెరగడానికి రకరకాల పజిల్స్‌తో మెంటల్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
7. పిల్లలు దేని కారణంగా పరధ్యానంగా ఉంటున్నారో తెలుసుకొని, చర్చిస్తే ఆ సమస్యకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది.
మనస్తత్వ నిపుణులను సంప్రదించి, మానసిక రుగ్మతతో ఉంటే చికిత్స తీసుకోవాలి.

rampa chodavaram