మధ్యాన్న భోజనాన్ని మానేస్తున్నారా..? పని ఒత్తిడి వల్లనో, లేక మధ్యాహ్నం భోజనం చేయడం వల్ల తరువాత నిద్ర వొచ్చే ప్రమాదం ఉందనో, లేక మరేదైనా కారణం వల్లనో మధ్యాన్న భోజనం చేయకుండా చాలామంది దాటేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ సమయం ఆదా అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు. మధ్యాన్న భోజనం మానేయడం వల్ల శరీరం లోని చక్కెరల శాతం తగ్గి మెదడు చురుకుదనాన్ని కోల్పోతుంది. దాని వల్ల అరగంటలో పూర్తి చేయదగిన పనికి రెండు గంటలు వెచ్చించాల్సి ఉంటుంది.
2. మధ్యాహ్నభోజనం మానేయడం వల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటి..?
సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఒత్తిడి మరింత పెరిగి అసహనానికి గురౌతారు. అసిడిటీ వంటి జీర్ణవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.ఇది మాత్రమే కాదు. మధ్యాన్న భోజనాన్ని మానేయడం వల్ల శరీరానికి తగిన పోషణ అందని కారణంగా త్వరగా అలసి పోవడం. ఒళ్ళు నొప్పులు, చర్మం కాంతి విహీనం కావడం జుట్టు రాలడం వంటి సమస్యలు పెరుగుతాయి. మధ్యాన్నం భోజనం మానేయడం వల్ల తర్వాత తినేటప్పుడు అవసరమైన దాని కన్నా ఎక్కువ తినే అవకాశం ఉంది దానివలన శరీరం లో కొవ్వు నిలువలు పెరిగి ఊబకాయం వస్తుంది.
3. మధ్యాహ్న భోజనం చేయడం వల్ల కలిగే లాభాలు..
మధ్యాహ్న సమయానికి శరీరానికి కార్బోహైడ్రేట్లు, ఇతరపోషకాలు అవసరమౌతాయి. సరిపడినంత ఆహారాన్ని సరైన సమయానికి శరీరానికి అందించడం వలన శరీరం చురుకుగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మిగిలిన రోజంతా సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ మధ్యాహ్న భోజనాన్ని నిర్లక్ష్యం చేయకండి.
No comments:
Post a Comment