Showing posts with label health. Show all posts
Showing posts with label health. Show all posts

Thursday, December 28, 2017

జలుబు దగ్గు నుంచీ విముక్తి పొందండిలా! – దగ్గు తగ్గడానికి చిట్కాలు

జలుబు దగ్గు నుంచీ విముక్తి పొందండిలా! – దగ్గు తగ్గడానికి చిట్కాలు

Image result for cold
వాతావరణం మారిందంటే చాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పు మొదలై ఎంతో సతమతమయ్యేలా చేస్తాయి. వీటి రాకతో మన శరీరం అంతా కంపించిపోయి అటు మింగలేక బయటకు కక్కలేక అన్న చందంలో పరిస్థితి మారుతుంది. అందుకే వీటిని అంటు వ్యాధులంటారు. వీటి నివారణకు మనం తీసుకునే ఆహారంలో స్వల్పంగా మార్పులు చేసి తీసుకుంటే వీటి బారిన పడకుండా ఉండటమే కాకుండా కాస్త ఉపశమనం పొందవచ్చు.
అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల బారినుంచి మనల్ని మీరు కాపాడుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీనికి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడమే ఏకైక ప్రాథమిక జాగ్రత్త.1.జలుబుతో బాధపడతున్నవారితో కలిసి పానీయాలు, లిప్‌స్టిక్‌లు, ఇతర వస్తువులను పంచుకోకూడదు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకుంటే క్రిములు నశిస్తాయి.
2.వర్షాకాలంలో రోజూ ఆరేడు సార్లు సబ్బుతో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా సాధ్యమైనంత వరకు కాపాడుకోవచ్చు.
3. పండ్లరసాలు, పండ్లసలాడ్‌లను సిద్ధం చేసుకున్న వెంటనే అప్పటికప్పుడే తీసుకోవాలి.
4. తాజాపండ్ల, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.
5. పెరుగు, మజ్జిగలను తాజాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.6. సాధ్యమైనంత వరకూ ఆహారాన్ని వేడివేడిగా తినాలి. పాత్రలపై మూతలు తప్పనిసరిగా పెట్టాలి.
7. ఆకుకూరలను కూడా ఒకటికి రెండుసార్లు కడిగి, బాగా ఉడకనిచ్చి ఆ తర్వాతే తినాలి.
8. జలుబు, దగ్గు తదితరాలకు పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ, బత్తాయి ఎంతో మేలు చేస్తాయి.
9. కర్బూజ, ఆఫ్రికాట్ల గుజ్జు, తాజా పెరుగును తీసుకోవాలి.
10.సూప్‌లలో కూరగాయలను ఎక్కువగా చేర్చాలి.
11.పుచ్చకాయ ముక్కలను నిత్యం తీసుకోవాలి.
12.మంచినీళ్లు, టమాట రసం తీసుకోవాలి. తాజా మొలకెత్తిన గింజలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
13.మాంసాహారం, కొవ్వుశాతం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. దీనివల్ల శాచురేటెడ్ కొవ్వు శాతం తగ్గుతుంది. జలుబు కారక క్రిములను నివారించే సి విటమిన్ నిమ్మకాయలో ఉంది కాబట్టి సమృద్ధిగా నిమ్మజాతిపండ్లను ఆరగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Wednesday, December 27, 2017

పరధ్యానం నుంచి బయటపడాలంటే

పరధ్యానం నుంచి బయటపడాలంటే

Image result for depression

పరధ్యానం అంటే?

మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అని మన పెద్దవాళ్ళూ, ఉపాధ్యాయులూ మనల్ని తిట్టటం తెలిసిందే. అయితే ఆ సామెతకు అర్థం మనిషిక్కడ, మనసక్కడ అని అర్థం. అయితే ధ్యానంలొ ఉంటే ఫర్వాలేదుగాని పరధ్యానంలో ఉంటేనే సమస్య. పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. ఈ సమస్యను చాలా మందిలో మనం చూస్తూనే ఉంటాం. అంతెందుకు మనమే ఒక్కోసారి అలా ప్రధ్యానంలో ఉండిపోతుంటం. ఆదేంటి నేను బాగా తెలివైనవాడినేనే నాకు అంతా బాగానే ఉంటుందే అని అనుకుంటున్నారా. తెలివితేటలు ఎక్కువైన వారికే ఎక్కువ ఈ సమస్య వస్తూ ఉంటుంది.
పరధ్యానానికి ఎన్నో కారణాలుంటాయి. వాటితో ఎన్నో సమస్యలూ వస్తాయి. వాటిని అధిగమించడాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.ఆఅ జగ్రత్తలేమిటో చుద్దామా..!పరధ్యానం అంటే ఏమిటి? మనిషి ఉన్న చోటే ఉండి, అతని ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉండటం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం కానట్టుగా ఉంటారు. దీని వల్ల ఎన్నో పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆలోచన, ఆచరణ ఒకేదానిపై కేంద్రీకరించినప్పుడు ఆ పని సఫలీకృతం అవుతుంది. అంతమాత్రాన పరధ్యానం మానసిక వ్యాధి అని చెప్పడానికి లేదు. కొంత మంది వ్యక్తితత్వం అలా ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే వ్యాధి రూపంలో ఒక లక్షణంగా ఉంటే ఉండొచ్చు. మామూలు వ్యక్తుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. పరధ్యానానికి వారు వీరు, వయసు తేడా ఏమీ లేదు.
పరధ్యానంగా ఉన్నవారిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదు. వీరు…సున్నిత స్వభావులై, కళాత్మక హృదయం కలవారై ఉంటారు. ఎక్కువగా ఊహల్లో విహరిస్తుంటారు. చిత్రకారులు, రైటర్లు.. ఈ కోవకు చెందుతారు. తాము చేయబోయే పనిని రకరకాలుగా ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, తమలో తాము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దైనందని జీవితంలో చుట్టుపక్కల వారిని పట్టించుకోరు. చాలా మెతకగా, నెమ్మదస్తులై ఉంటారు. రకరకాల కాంపిటిషన్స్‌లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని చూపరు. పైగా వీటికి చాలా దూరంగా ఉంటారు.ఎప్పుడూ మానసిక ప్రశాంతను కోరుకుంటారు. తమ భావాలను మరొకరితో పంచుకోవడానికి అంత ఉత్సాహం చూపరు. తక్కువగా మాట్లాడుతారు. ప్రతి ఒక్క విషయానికి ఇంకొకరిమీద ఆధారపడుతుంటారు. మెచ్యూర్డ్‌గా ఉండరు. సహజత్వానికి దూరంగా ఉంటారు.

పరధ్యానంగా వల్ల తలెత్తే సమస్యలు

1.నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో ఆ పని మైండ్‌లో రిజిస్టర్ కాదు.
2.ఇది పిల్లల్లో అయితే చదువులో వెనకబడేలా చేస్తుంది.3. పెద్దల్లో పనుల్లో లోపాలు, జాప్యం, కెరియర్‌లో ఎదుగుదల లేకపోవడం వంటి నష్టాలు సంభవిస్తుంటాయి.
4.సమస్యల నుంచి తప్పుకోవాలనుకుంటారు. ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు.
5.కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో దూరంగా ఉంటారు కనుక ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడతుంటారు.
6.వివాహ బంధంలో భాగస్వామితో త్వరగా సర్దుకుపోలేరు. ఎదుటి వ్యక్తి అంటే ఉండే భయం కారణంగా వివాహం కూడా వద్దనుకుంటారు.7.ఏదైనా వర్క్ విషయంలో ‘చేస్తాను’ అని మాట ఇచ్చి నిలుపుకోలేరు. దీంతో ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోతుంటారు.

ఈ సమస్యకు కారణాలు

1. వంశపారంపర్యం: తల్లిదండ్రుల్లో పరధ్యానం సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చే అవకాశం ఉంటుంది.
2. కుటుంబ వాతావరణ: ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలతో చులకనగా మాట్లాడటం. ‘నీకే పనీ చేతకాదు, ఓ చోట కూర్చో, నువ్వు సరిగ్గా చదవలేవు…’ వంటి పెద్దల మాటల ప్రభావం చిన్నతనంలో ఒంటరిగా ఉండేలా చేస్తుంది.
ఇంకొంతమంది పిల్లల్ని అతిగారాబం చేస్తుంటారు. తింటున్నా, కూర్చున్నా, నిల్చున్నా… ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భావంలో ఉంటారు. అన్నీ సజావుగా జరిగిపోవడంతో ఎప్పుడూ సౌకర్యాన్నే కోరుకుంటారు. తమకు అనుగుణంగా లేనప్పుడు త్వరగా మూడీ అయిపోతారు. ఇవి రకరకాల ఆలోచనలను కలిగిస్తాయి.
3. పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు (ఎమోషనల్ ప్రాబ్లమ్స్), అతిగా ఆలోచిస్తున్నప్పుడు కూడా పరధ్యానం వస్తుంటుంది.
4. పెద్దవారిలో పర్సనాలిటీ డిసార్డర్స్, మేజర్ డిప్రెషన్ డిసార్డర్స్ వల్ల మనసు దిగులుగా, దుఃఖంగా ఉండటం, తమను తాము తక్కువగా అంచనా వేసుకొని వాళ్లలో వాళ్లు లీనమైపోతారు.స్కిజోఫ్రీనియో: ఇది తీవ్రతరమైన మానసిక జబ్బు. వ్యక్తి తన ఆలోచనల్లో తాను ఉండిపోతాడు. చుట్టుపక్కల వాతావరణం అంతా బాధాకరంగా అనిపిస్తుంటుంది. అందరూ బాధపెట్టేవారుగానే కనిపిస్తారు. రకరకాల అనుమానాలు పెట్టుకుంటారు. తమ ముందు ఎవరూ లేకున్నా, ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటారు.
మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు అలవాటైన వారు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఉంటారు. మందుల ప్రభావం వల్ల, వ్యసనం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.
మల్టీటాస్కింగ్ : ఒకేసారి రకరకాల పనులు చేసేవారిలో అయోమయం నెలకొంటుంది.
వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగాలు.. ఎన్నో రకాల పనులు పెట్టుకునేవారిలో ఈ సమస్య ఉంటుంది. దీని వల్ల తప్పులు దొర్లుతుంటాయి. ఏకాగ్రత లోపిస్తుంది.స్ర్తీలు- ఇంటి పనులు, పిల్లల పనులు, ఉద్యోగినులైతే ఆఫీస్ పనులు. ఇలా ఒక పని తర్వాత మరో పని పెట్టుకొనే వారు, పనులను ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోనివారు పరధ్యానంగా కనిపిస్తుంటారు. దీంతో ‘మర్చిపోతున్నాం’ ‘మతిమరుపు మూలంగా ఏ పనీ చేయలేకపోతున్నాం’ అని తిట్టుకుంటూ ఉంటారు. కాని ఇది మతిమరుపు కాదు, పరధ్యానం వల్ల కలిగే సమస్య.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే

1. ఇష్టమైన పనులు చేయాలి. వారం మొత్తం ఏమేం పనులు చేశామో వారాంతంలో గుర్తుచేసుకొని బుక్‌లో రాసుకోవాలి.
2. ఏకాగ్రత కుదరడానికి, సోషల్ స్కిల్స్‌లో ప్రావీణ్యానికి శిక్షణ తీసుకోవాలి.
3. పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.
4. సమయానుకూలంగా పనిని విభజించుకొని దానికి తగినట్టుగా పనులు చేసుకోవాలి.
5. అదేవిధంగా ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా రాసుకోవాలి. అనుకున్న పని పూర్తవగానే టిక్ పెట్టుకోవాలి.
6. ఏకాగ్రత పెరగడానికి రకరకాల పజిల్స్‌తో మెంటల్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
7. పిల్లలు దేని కారణంగా పరధ్యానంగా ఉంటున్నారో తెలుసుకొని, చర్చిస్తే ఆ సమస్యకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది.
మనస్తత్వ నిపుణులను సంప్రదించి, మానసిక రుగ్మతతో ఉంటే చికిత్స తీసుకోవాలి.

గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Image result for green tea

ప్రస్తుతం మనం రోజూ వారి జీవితంలో మన ఆరోగ్యన్ని రక్షించుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అందులో సహజమైన,పద్దతిలో, అందరికీ, అతి తక్కువ ఖర్చుతో లభించేది ఈ గ్రీన్ టీ, ఇది ఎప్పటినుంచో ఆరోగ్య సం రక్షణలో ఎంతోగానో ఉపయోగపడుతుంది,అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:

  •  క్యాన్సర్ పై పొరాడుతుంది:క్యాన్సర్ అనేది మన శరీరంలోని రక్త కణాలని,క్యాన్సర్ కణాలుగా మార్చుకుంటూ అధికమవుతుంది, ఈ గ్రీన్ టీ రక్త కణాలకు ఇబ్బంది కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగిస్తూ,  పెద్దప్రేగు ,కడుపు భాగం, క్లోమము మరియు పిత్తాశయమును క్యాన్సర్  ప్రమాదము నుండి కాపాడుతుంది.

  •  గుండె జబ్బులు నయం చేస్తుంది :ఈ గ్రీన్ టీ గుండెపోటు, రక్తపోటు, వంటి ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది, దీని వల్ల మన మన గుండెలో కొవ్వు శాతం తగ్గి, గుండే,రంద్రాలు శుబ్రం అవుతాయి.

  • రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

  • కీళ్ళ నొప్పి,కీళ్ళవాతం ఇలాంటి ఇబ్బందులనుండి కాపాడుతుంది.

  •  మనలోని రోగ నిరోదక శక్తిని పెంచి, రక రకాల రోగములు, క్రిముల నుండి మనల్ని రక్షించడమే కాకుండా ఎటువంటి  వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది.

  •  కాలేయ రక్షణకై: మన శరీరంలోని కొన్ని విష పదార్దాల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది, ఈ గ్రీన్ టీ వాటిని తొలగించి మీ కాలేయాన్ని కాపాడి మంచిగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

  •  ఇది మనలో పేరుకున్న కొవ్వుని తొలగించి, గుండె పోటుకి, అధికబరువుకి దూరంగా ఉంచుతుంది,

ఇంకెందుకు ఆలస్యం  రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తీసుకొండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

డెంగ్యూ గురించి తెలుసుకుందాం

డెంగ్యూ గురించి తెలుసుకుందాం రండి..!


Image result for dengue
అమ్మో..డెంగ్యూనా అని ప్రతి ఒక్కరూ భయపడుతున్న అంటువ్యాధి డెంగ్యూ.ఇప్పుడు భారతదేశంలో ప్రజలను గడ గడలాడిస్తున్న అంటురోగాలో ముఖ్యమైనది.ఉష్ణదేశోత్పన్నమైన ప్రాంతాలలో,ఉప ఉష్ణదేశోత్పన్నమైన ప్రాంతాలలో ఇది బాగా ప్రబలుతుంది.దీనినే ఆంగ్లంలో ‘బ్రేక్ బోన్
ఫీవర్ ‘ అనికూడా అంటారు.ఈ వ్యాధి దెంగ్యూ వైరస్ వల్ల ఇది సోకుతోంది.దీనివల్ల జ్వరం, తలనొప్పి, నరల నొప్పులు,కొండరాల నొప్పులు, తట్టు మచ్చలు వస్తాయి.కొంత మందిలో చలా తక్కువ శాతం మంది దెంగ్యూ వ్యాధి సోకి రక్తస్రావం, రక్తపట్టికల శాతం పూర్థిగా తగ్గిపోవటం వంటివి జరుగుతాయి.అలాగె
కొన్నిసార్లు రక్తంలోని ప్లాజ్మా కారే అవకాశాలున్నాయి.ఈ వ్యాధి డెంగ్యూ షాక్ సిండ్రోం లొనికి కూడా మెల్ల మెల్లగా చేరుస్తుంది.ఇది చాలా ప్రణాంతకమైన వ్యాధి.ఈ డెంగ్యూ వ్యాధి దోమల వల్ల కకుగుతోంది.ముఖ్యంగా ఆఎదెస్ ఏగ్య్ప్తి అనే దోమ కారణంగా వస్తుంది.ఈ దోమ మానవుని కుట్టినప్పుడు దెంగ్యూ వ్యాప్తి
చెందుతుంది.దీనిలో కొన్ని రకాలున్నాయి.కొందరిని ఈ వ్యాధి జీవితంతాం మాపు లేకుండా బాధిస్తుంది,మరికొందరిలో కొంతకాలం తన ప్రభావాన్ని చూపుతుంది.ఏది ఏమైనా ఈ వ్యాధి తీవ్ర ఇబ్బ్బందులకు గురిచేస్తుంది.ఇంకా దీనికి వాక్సిన్ ను కనిపెట్టని కారణంగా ముందు జాగ్రత్త చర్యలే తీసుకోవాలి.అవి ఎంటో
మనం ఇప్పుదు చూద్దామా..!

డెంగ్యూ వ్యాధి లక్షణాలు.

జ్వరం:
అకస్మాత్తుగా ఇది ప్రవేశిస్తుంది.
39.5-41.4°సి ఉష్నోగ్రతల వరకూ ఉంటుంది.
1-7 రోజుల కడపటి రోజుల వరకూ వస్తుంది.1-2 రోజులకు జ్వరం తగ్గుతూ వస్తుంది.
మరలా రెండవ దశగా చిన్న చిన్న తట్టు మచ్చల్లా మొదలవుతుంది.
తలనొప్పి:
సాధారణంగా జ్వరంతో పాటూ తలనొప్పి మొదలవుతుంది.అయితే తల నుదుటి మీదకాని.కళ్ళ వెనుక కానీ తలనొప్పి వస్తుంది.
నరాల నొప్పి లేదా ఎముకుల నొప్పి:1.జ్వరంతో పటూ ఇవి బాధిస్తాయి.ఈ నొప్పులు తీవ్ర స్థాయిలో ఉంటాయి.
2.కటి కుడివైపు గానీ,కాళ్ళవద్దగానీ, కీళ్ళ వద్దగానీ వస్తాయి.
ఈ నొప్పులు చాలా తీవ్ర స్థాయిలో బాధిస్తాయి.
3.జ్వరం తగ్గినా నొప్పులు మాత్రం కొన్ని వారాల వరకూ బాధిస్తూనే ఉంటాయి.
నొప్పులు సాధారణంగా డీహెచెఫ్ఫ్ /డీఎసెస్ లో పోతాయి.
ఆరోచితము మరియూ వాంతులు:
1.ఆకలి మందగించటం జరుగుతుంది.
2.వాంతుల స్థాయి పెరిగిపోతుంటుంది.
3.రుచి మారిపోతుంటుంది.
4.లక్ష్ణాలు పిల్లల్లో ఉన్నంత తక్కువగా పెద్దల్లో ఉండవు.
తట్టు మచ్చలు:
ఇవి రావటం మెల్లగా మొదలవుతుంది.

డెంగుఎ హెమోర్ర్హాగిచ్ Fఈవర్ / డెంగ్యూ షాక్ సిండ్రోం:

వ్యాధి మొదలైన కొన్ని రోజులకే డెంగ్యూ అని తెలుస్తుంది.
అంతేకాక జ్వరం సహాయంతో 2-7 రోజుల తర్వాత లక్ష్ణాలు మరింతగా పెరుగుతాయి.అవి:
1.విశ్రాంతి లేకపోవటం.
2.రక్త ప్రసరణ వ్యవస్థ పాడవుతుంది.
3.రక్త స్రావం తో పాటూ మరిన్నింటిని స్పష్టం చేస్తుంది.
4.చర్మంపై ఎర్ర మచ్చలు వచ్చి బాధిస్తాయి.
5.ముక్కులోనుంచి రక్తం కార్టం జరుగుతుంది.
6.పంటి చిగురు నుంచి రక్తం కారతుంది.
7.పొట్టలోనుంచి రక్తం వస్తుంది.అంతే వాంతులు అయ్యే సమయంలో రక్తం పడుతుంది.
8.రక్త పట్టికల సాతం క్రమేపీ తగ్గిపోతుంది.డెంగ్యూ నివారించటానికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టడం జరుగలేదు.అందువల్ల దీనికి ముందు జాగ్రత్త చర్యలే మార్గం.అవేంటో చూద్దాం.
ముఖ్యాంగా ఈ డెంగ్యూని వ్యాప్తి చేసేది దొమలే కాబత్తి దోమ కాటు నుంచి జాగ్రత్త వహించాలి.
ప్రపంచా ఆరోగ్య సంస్థ దిశానిర్దేశకాల ప్రకారం ఇంటిగ్రేటెడ్ వెక్టర్ కంట్రోల్ ప్రోగ్రాం అనే ప్రోగాం ద్వారా ఇచ్చింది.
1.అవగాహనా విధానలను అందరికీ తెలియ చెప్పాలి.
2.ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సమన్వయంతో దీనిపై అవగాహన కల్పించాలి.
3.వ్యాధిని నివారిచేందుకు అన్నివిధాల ప్రయత్నించాలి.
4.క్రియాశీలకమైన,నిర్ణయాత్మక తో వ్యాధి ఏ ప్రదేశాలలో ఎక్కువ ప్రబలిందో చూడాలి.
5.ఈ వ్యాధిని ఎదుర్కొనేదుకు శక్తి సామర్ధ్యాలను పెంచుకుని సమిష్టిగా క్రుషి చేయాలి.

ఇంత్లో మనం పాటించవలసిన జాగ్రత్తలు:

1.దోమలను సాధ్యమైనంతగా రానివ్వకుండా చూసుకోవాలి.
2.మురికి కాల్వలను పరిసరాలలో లేకుండా చూసుకోవాలి.
3.దోమ తెరలను వాడాలి.
4.రోజూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
5.పొడవాటి బత్తలను శరీరాన్ని పూర్థిగా కప్పేటట్లు వేసుకోవాలి.
ఇలా ముందు జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ వ్యాధికి దూరంగా ఉండవచ్చు.

పిల్లల్లో ఒంటరితనం పారదోలాలంటే

పిల్లల్లో ఒంటరితనం పారదోలాలంటే

Image result for depression
ప్రస్తుతం ఉన్న సమాజంలో సామాజిక, ఆర్థిక, యాంత్రిక జీవితంలో తల్లిదండ్రులు కాస్త సమయం పిల్లలకు కేటాయించాలంటే అది చాలా కష్టమైపోతుంది. అదీకాక ఈ మధ్య ఒకే ఒక సంతానంతో తృప్తి చెందటం లేదా ఆ ఒక్కరినే బాగా చూడాలనీ, బాగా చదివించాలని తల్లిదండ్రులు కోటి ఆశల్ని కలిగిఉంటున్నారు. మరి మనపెద్దవాళ్ళు ఊరకే అనరు ఒక బిడ్డే అయితే వారికి తోడేది అని..అవును, ఇది నిజం. ఒక సంతానమే అయితే వారు ఒంటరితనం కు బానిసలైపోయి వారి మానసిక ఉల్లాసం దెబ్బతినటం మాత్రం ఖాయమే. అయితే తల్లిదండ్రులకు వారి పిల్లల్ని ఒంటరితనంలోపడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను మీకు అందిస్తున్నాం. అవేంటో చూసేద్దామా..
Image result for child lazy boy1. ఇంట్లో ఒక్కరే ఉంటే ఎవరితో ఆడుకోవాలో తెలియదు. బయట స్నేహితులున్నా అదీ కాసేపే. ఇలాంటప్పుడు పేరెంట్స్ ఒంటరితనాన్ని పోగొట్టడానికి రోజులో ప్రత్యేకించి కొంత సమయం వారితో తప్పనిసరిగా గడిపేలా ప్రణాలిక చేసుకోవాలి. ప్రత్యేక శ్రద్ద వారిపై చూపాలి.2. ఈ రోజుల్లో భార్యభర్త సంపాదనాపరులు అవడం, ఒక్కరే అని పిల్లలపై కానుకల వర్షం కురిపిస్తుంటారు. పిల్లల అవసరాలకు మించి ఇచ్చే ప్రతి కానుక వారికి చెడే చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చేస్తుంటే కష్టం అంటే ఏమిటో తెలుసుకోలేరు. ఫలితంగా జీవితంలో వచ్చే ఒడిదొడుకులను తట్టుకోలేరు.
3. ఈ ఆధునిక ప్రపంచంలో థియేటర్ ఆర్ట్స్ నుంచి ఆస్ట్రానమీ వరకు, కరాటే నుంచి పెయింటింగ్ వరకు, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్… ఒకటేమిటీ మల్టీ టాలెంట్‌కు కావల్సిన అవకాశాలు ఉన్నో ఉన్నాయి. వాటిని మీ బాబు లేదా పాప అందిపుచ్చుకోవడానికి అవకాశాలు కల్పించండి. ఒంటరితనం అనే భావనే వారి దరిచేరదు.
4. సాహిత్యాన్ని పరిచయం చేస్తే పుస్తకాల మీద ఆసక్తి పెరుగుతుంది. పుస్తకాలు స్నేహితుల లోటును భర్తీ చేస్తాయి. ఒంటరిగా ఉండే పిల్లలు టీవీ చూడటం, ఇంటర్‌నెట్ బ్రౌజింగ్‌తో కాలాన్ని వృధాగా గడిపేస్తుంటారు. అందుకని కచ్చితమైన సమయాన్ని మాత్రమే కేటాయించాలి.5. ఫ్యామిలీ ఫ్రెండ్స్, బంధువులతో సందడిగా ఉండే వాతావరణాన్ని సృష్టించండి. కుటుంబ పరిధి పెరుగుతున్నా కొద్ది పిల్లలు ఒంటరివారమనే భావనకు దూరం అవుతారు.
6. అమ్మాయో, అబ్బాయో ఒక్కరే ఉంటే ఇంట్లో వారి దృష్టి అంతా వారి మీదకే మళ్లుతుంది. ఒక్కరే కదా అని అతి శ్రద్ధతో పిల్లలను స్వేచ్ఛను హరించడం వారి భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు. అడుగు వేస్తే కందిపోతారేమో అన్నంతగా చూస్తే పిల్లలు ఏ పని చేయడానినికైనా సొంత నిర్ణయం తీసుకోలేరు.
7. స్నేహితులుగా ఉండగలగే ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణం, భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఉంటే ఒంటరి అనే భావనే పిల్లల దరిచేరదు.

ఆస్థమా ఉన్నవారు తీసుకోవల్సిన జాగ్రత్తలు

ఆస్థమా ఉన్నవారు తీసుకోవల్సిన జాగ్రత్తలు

Image result for asthma care
ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
ఊపిరితిత్తులు మనం బతకడానికి కావలసిన ప్రాణవాయువుని శ్వాస ప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతి రోజూ మన శ్వాస కోశాలు వివిధ రకమైన వాతావరణ పరిస్థితులకు, ఎలర్జెన్స్‌కి, రసాయ నాలకి, పొగ, దుమ్ము, ధూళి తదితర వాటికి లోనవుతుంటా యి. వీటి వలన వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.ఆస్థమా సర్వసాధారణమైన దీర్ఘకాలిక జబ్బులలో ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తులలోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జెన్స్‌) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతి చర్యగా మన శరీరం స్పందించి వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తుంది.
ఆస్థమా వల్ల వచ్చే ఇబ్బందులు:
1. ఆస్థమా ప్రభావం వలన మన శ్వాస నాళాలు కుంచించుకొని పోతాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
2. ఆస్థమా ఉన్నవారిలో తరచుగా ఆయాసం రావడం, పిల్లి కూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేక పోవడం లేదా వ్యాయామం చేస్తే ఆయాసం రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
3. వీరిలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుంచి నీరు కారడం, తరచుగా జలుబు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి. చాలా మందిలో ఈ ఆస్థమా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
వాతావరణ కాలుష్యం ప్రభావం:
1. ఇంటి లోపలి గాలి కాలుష్యం వలన కూడా ఆస్థమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
2. ఇల్లు ఊడ్చడం వలన, గ్యాస్‌ స్టవ్‌ వాడడం వలన, వేపుడులు చేయడం వలన, అగరబత్తీలు వాడడం, ధూమపానం, వంట చేయడం వలన వచ్చే పొగలు తదితరాలు
3. అలాగే గాలిలోకి పార్టి క్యులేట్‌ మెటీరియల్స్‌, రసాయనాలు, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, ఓజోన్‌ వంటి వాటిని విడుదల చేస్తాయి. వీటి వలన ఆస్థమా పెరగవచ్చు.
4. ఇంట్లో వాడే ఎయిర్‌ ఫ్రెష్‌నర్స్‌, అయోనైజర్స్‌, జిరా క్స్‌ యంత్రాలు, ఎయిర్‌ క్లీనర్స్‌, ఫిల్టర్స్‌, ప్యూరిఫయర్స్‌ తదితర వాటి వలన ఇంట్లో ఓజోన్‌ ఉత్పత్తి అవుతుంది. బయటి వాతా వరణం కాలుష్యం వలన ఆస్థమా చాలా పెరుగుతుంది.
5. డీజిల్‌ వాహనాల వలన గాలిలోని పార్టిక్యు లేట్‌ మేటర్‌, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, సల్ఫర్‌ డై ఆకై్సడ్‌, సీసం పొగ లు, కార్బన్‌ మోనాకై్సడ్‌ వంటివి సూర్యరశ్మితో చర్య జరిగి ఓ జోన్‌, పొగమంచును విడుదల చేస్తాయి. వీటి వలన బ్రాంకై టిస్‌, ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నింటి వలన వేసవిలో ఆస్థమా వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంది.
6. ఆస్థమా ఉన్నవారు జబ్బుని సరిగా అదుపులో ఉంచుకొనకపో యినా, దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేసినా, ఎయిర్‌ వే రీమోడలింగ్‌ జరిగి సిఒపిడిగా పరిణామం చెంది తద్వారా గుండె ఫెయిల్‌ అవుతుంది. చిన్న పిల్లలో ఎదుగుదల, చురుకుదనం తగ్గుతాయి. తరచూ వచ్చే ఆయాసం వలన వృత్తికి లేదా బడికి సెలవు పెట్టడం తద్వారా కెరీర్‌ దెబ్బతినడం, కుటుంబ వైద్య ఖర్చులు పెరగడం జరుగుతుంది.
ఆస్థమాలో రకాలు…
ఎలర్జిక్‌, నాన్‌ ఎలర్జిక్‌ ఆస్థమా, యర్లీ, ఆన్‌సెట్‌ ఆస్థమా, వ్యాయామం వలన వచ్చే ఆస్థమా, పొడిదగ్గులాగా వచ్చే ఆస్థమా, వృత్తి ఆస్థమా, స్టిరాయిడ్‌ రెసిస్టెంట్‌ ఆస్థమాలు నేడు వస్తున్నాయి. వీటన్నింటిని సరిగా కనుక్కొని మందులను వాడుకోవాలి.
జాగ్రత్తలు…
1. ధూమపానానికి, ధూమపానం చేసేవారికి దూరం గా ఉండాలి.
2. డస్ట్‌మైట్స్‌ రాకుండా దుప్పట్లు, దిండ్ల కవర్లు ప్రతివారం వేడినీటిలో తరచూ ఉతికి ఎండలో ఆరబెట్టాలి.
3. ఇంట్లో తివాచీలు ఉంచకూడదు. దుమ్మదూళికి దూరంగా ఉండా లి. ముఖ్యంగా పాత పుస్తకాలు, పేపర్ల జోలికి వెళ్లకూడదు.
4. ఇల్లు ఊడవడానికి బదులు తడిగుడ్డతో తుడుచుకోవడం లేదా వాక్యూమ్‌ క్లీనర్స్‌ వాడుకోవడం మంచిది. ఇంట్లఒ బూజులు దులపడం లాంటివి ఆస్థమా ఉన్నవారు చేయకూడదు. ముక్కు కి గుడ్డ కట్టుకొంటే మంచిది.
5. పెంపుడు జంతువులని సాధ్యమై నంత దూరంగా ఉంచాలి. ఇంట్లో పురుగు మందులను స్ప్రే చేసేటప్పుడు ఇంట్లో ఉండకూడదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రిజ్‌ వాటర్‌ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉన్న కాలంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిది.

వాకింగ్ వల్ల ప్రయోజనాలు – Health benefits of walking in Telugu

వాకింగ్ వల్ల ప్రయోజనాలు 

Health benefits of walking in Telugu

Image result for youth care
ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణంలో అదేవిధంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పోటీ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా ఆ పనికి సమయం కేటాయించటం వల్ల లాభమేంటి అని ఆలోచిస్తున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక వ్యాయామం అవసరం. అయితే అన్ని వయసులవారూ అన్ని వ్యాయామాలూ చేయలేకపోవచ్చు. అందుకే అన్ని వయసులవారూ చేయగలిగిన వ్యాయామం వాకింగ్. నిజమే ఇది రోజులో ఏదో సమయంలో చేయటం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.
వాకింగ్ మీ కండరాలకు ఉపశమనం మరియు రిలాక్స్ ద్వారా మీ శరీరానికి రక్త ప్రసరణ అభివృద్ధి పెరుగుతుంది. అంతేకాక తొడ ప్రాంతంలో కొవ్వు నిల్వలను కరిగిస్తుంది. సాధారణ వాకింగ్ మీ కండరాలను ఫ్లెక్స్ మరియు బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రోజులో ఏదో ఒక సమయంలో పాదాల నొప్పులను కలిగి ఉండటం జరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది. అందుచేత భౌతిక వ్యాయామ రూపంగా వాకింగ్ రోజులో కొంతసేపు చేయటం ముఖ్యం. వాకింగ్ సున్నితమైన మరియు తక్కువ ప్రభావం చూపే మరియు ఈ వ్యాయామం మీ శరీరం యొక్క అత్యంత సహజమైన రూపాల్లో ఒకటి. అంతేకాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాకింగ్ క్రమం తప్పకుండా చేయుట ద్వారా గుండె మరియు ఊపిరితిత్తుల పరిస్థితి మెరుగుపరచడానికి మరియు శరీర కండరాలు తక్కువగా పనిచేయటానికి సహాయపడుతుంది. వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..1. ఉదయాన్నే వాకింగ్ చేయుట వలన ఇరుకైన మరియు చల్లని కండరాలు సాగుతాయి. అంతేకాక ముందు రోజు మరియు రాత్రి నుండి పంపులలో ఆక్సిజన్ భర్తీకి సహాయం చేస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది.
2. వాకింగ్ చేయుట వలన కాలి కండరాలకు బలాన్ని మరియు ప్రోటీన్ బర్న్ కు సహాయం చేస్తుంది.
3. మీరు సాదారణంగా ఉదయం మేల్కొనినప్పుడు,మీ శరీరం సాధారణం కంటే ఎక్కువ ఆవలింత చేస్తుంది. అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. మీరు వాకింగ్ చేయుట వలన మీ శరీరంనకు శ్వాస మరియు అధికంగా ఆక్సిజన్ కుడా లభిస్తుంది. వాకింగ్ ద్వారా మీ కాళ్ళు మరింత ప్రభావితమవుతాయి. ఇది శరీరం మరియు కాలి కండరాలను బలోపేతం చేయుటంలో సహాయపడుతుంది
4. రెగ్యులర్ గా వాకింగ్ చేయుట వలన మీ కండరాలు మరియు దాని చుట్టూ పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపటానికి సహాయపడుతుంది.
5. కాళ్ళు మరియు పిక్కలలో స్థూలమైన కొవ్వును తగ్గించేందుకు మరియు సరిగ్గా ప్రేరణ లేక లెగ్ చుట్టూ మరింత కొవ్వు జమకు ఆకర్షిస్తుంది. కండరాలు వదులుగా మరియు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. మీరు టోనింగ్ మొదలుపెట్టిన తర్వాత మీ మొత్తం కాళ్ల మీద ఒక మంచి ప్రభావం ఉంటుంది.
6. వాకింగ్ అనేది అన్ని వయసుల వారికి సరిపోతుంది. వాకింగ్ అన్ని వయస్సుల వారికీ భౌతిక వ్యాయామం యొక్క ఒక రూపంగా ఉంటుంది. వేగం కూడా మీ కాళ్ళ ఎముకలపై చాలా కఠినముగా ఉండదు. చురుకైన వాకింగ్ మీ మోకాలు మరియు చీలమండలను మృదువుగా చేస్తుంది. సమానమైన వేగంతో వ్యాయామం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ కాలం మరియు అనుకూలంగా ఉంటాయి. వాకింగ్ సంబంధ గాయాలు ఎక్కువగా చీలమండ మరియు కొంత సమయం తిమ్మిరి ప్రభావితం మరియు అరుదైన సందర్భాల్లో పిక్క కండరాలలో ఉంటుంది. అయితే ఇది తక్కువ మరియు చాలా అరుదుగా జరుగుతుంది.
7. మొత్తం శరీరం బాగా గుండ్రంగా ఫిట్నెస్ కోసం తగినంత వాకింగ్ చేస్తే కండరాలు శక్తిని పొందుతాయి. వాకింగ్ లో కాలి వెనక మొత్తం కండరాలు,పిక్కలు,మోకాలి వెనుక వద్ద నాడులు మరియు పిరుదులు అదనపు వ్యాయామం పొందుతాయి. మీ చేతులు స్వింగ్ మరియు భుజాలు వెనుక కండరాల బలానికి ఉపయోగపడుతుంది.
8. యావరేజ్ వయస్సు ఉన్నవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల నడక అవసరం.

యువత ఆరోగ్యంగా ఉండాలంటే?

యువత ఆరోగ్యంగా ఉండాలంటే?

Image result for youth care

మానవ జీవిత చక్రంలో అతి కీలకమైన వయస్సు యవ్వనం. అది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే యువత ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. నేటి యువత ఆరోగ్యం వారు తీసుకునే పౌష్టికాహారంలోనే ఉంటుంది. యవ్వనంలో ఉన్న స్త్రీ పురుషులిద్దరికీ ఈ ఆరోగ్య చిట్కాలను అందిస్తున్నాం. మరి ఆ పౌష్టికాహారం ఏమిటో తెలుసుకుందామా..
1. మొదట ఆరోగ్యం మీ చెంత చేరాలంటే మీ కడుపులో మలం ఉంటే మీరు ఎంత తిన్నా, మంచి పౌష్టికాహారం తీసుకున్నా ఏమాత్రం ఫలితం లేదంటున్నారు వైద్యులు. భోజనం తినేటప్పుడు బాగా నమిలి తినాలి, దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి సరిగా లేకపోతే మందులు వాడాల్సివస్తుంది.2. పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒకస్పూన్ నెయ్యి కలుపుకుని తాగాలి.
3. పాల మీగడతోటి కలకండను కలుపుకుని తీసుకుంటే శరీరానికి మంచి బలాన్నిస్తుంది.
4. రెండు స్పూన్ల ఎర్రగడ్డ రసం, ఒక స్పూన్ తేనె, కాసింత నెయ్యి కలిపి తీసుకుంటే యోని శక్తి వృద్ధి చెందుతుంది.
5. చిలగ్గొట్టిన మజ్జిగ నుంచి వచ్చిన వెన్నతోబాటు కలకండ కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత నీటిని తాగకూడదు.
6. అరలీటరు పాలలో 50 గ్రాముల ఉద్దిపప్పు వేసి ఉడకబెట్టిం తర్వాత దానిని పాయసంలాగా త్రాగండి. దీనివలన శరీరానికి మంచి బలం చేకూరుతుంది.
7. 1/4 లీటరు పాలలో ఒక స్పూను అశ్వగంధ చూర్ణం, ఒక స్పూను కలకండ కలిపి ఉదయం..రాత్రిపూట తీసుకుంటే మార్పు కనపడుతుంది. ఇలా 40 రోజులు తీసుకోవాలి. ఈ పదార్థాం తీసుకున్నతర్వాత రాత్రి నోరు పుక్కలించి పడుకోవాలి.
8. ఉదయం పూట 1/4 లీటరు పాలతోబాటు రెండు..మూడు అరటిపండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ముఖంపై కాంతి కూడా బాగా పెరుగుతుంది.
9. ఉదయంపూట 1/4 లీటరు చల్లటి పాలలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రక్త శాతం వృద్ధి చెందుతుంది.
10.ఉదయం..రాత్రి భోజనం తర్వాత ఆపిల్, దానిమ్మ, అరటి, లేక ఏదైనా ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలి.
11.బాదం పప్పును రాతిమీద అరగదీసి పాలల్లో కలుపుకుని తాగాలి. దీంతో అపారమైన శక్తి లభిస్తుంది

మీకు పుట్టబోయే బిడ్డ కోసం ఆహార నియమాలు

మీకు పుట్టబోయే బిడ్డ కోసం ఆహార నియమాలు

Image result for pragnant woman

ఫ్రతి స్త్రీకి నూటికి నూరు మార్కులు వచ్చేది సంతాన ప్రాప్తితోనే. అందుకే ఆడది సంతానం కోసం తపిస్తుంది. ఏది ఏమైనా సంతానం లేకపోతే బ్రతకలేనంటుంది. సంతానం పోందేందుకు ఎన్ని కష్టనష్టాలనైనా ఓర్పుతో సహించి నిండు మాసాలూ బరువు మోసి ఓ ప్రాణాన్ని ఇలలోనికి తెస్తుంది. మరి ఆ బిడ్డ పుట్టేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలేమితో చూద్దామా..గర్భం దాల్చారని తెలుసుకునేలోపే మూడు నెలలు గడిచిపోతాయి. చాలా మంది విషయంలోనూ ఇలానే జరుగుతుంది. కొంత మంది మాత్రం ప్రెగ్నెసీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడతారు. నిజానికి అలా చేయడం చాలా ముఖ్యం. హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకు మందులు వాడుతూ ప్రెగ్నెసీ కోసం ప్రయత్నించాలి.
గర్భం దాల్చాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. మొదటి 3 నెలల్లో అదనపు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సమతుల ఆహారం తీసుకోవాలి. గర్భం దాల్చిన వారికి ఫోలిక్ ఆసిడ్, ఐరన్ చాలా అవసరం. కాబట్టి ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. క్యాబేజీ, బత్తాయి, ఖర్జూర, మాంసాహారం తీసుకుంటే మంచిది. అలాగే హీమోగ్లోబిన్ శాతం సరియైన స్థాయిలో ఉందో లేదో పరీక్ష చేయించుకోవాలి. ఐరన్ కోసం డేట్స్ తీసుకోవచ్చు. ఈ మొదటి 3నెలల సమయంలో అదనపు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ వెయిట్ ఉండేలా చూసుకోవాలి.ఈ సమయంలో కూడా అదనపు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. సమతుల ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అలాగే బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతి రోజు ధాన్యపు గింజలు, రాగులతో చేసిన ఆహారం తీసుకోవాలి. రాగులలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా దొరుకుతుంది. తాజా పండ్లు తీసుకోవడం కూడా చాలా అవసరం. పాలు, పెరుగు తప్పకుండా తీసుకోవాలి. పాల ఉత్పత్తులను ప్రతి రోజు 300 ఎంఎల్ తీసుకుంటే గర్భిణిలకు చాలా మంచిది. ప్రోటీన్స్ సమృద్ధిగా లభ్యమయ్యే పప్పుధాన్యాలు, మాంసాహారం, చేపలు, గుడ్లు మెనూలో ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ పదార్థాలు, స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి.
ఈ సమయంలో బిడ్డ పెరుగుదల వేగంగా ఉంటుంది. ఇప్పుడు బిడ్డకు కూడా ఆహారం అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అదనపు ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో బరువు తగ్గడం మంచిది కాదు. బరువును ఎప్పటిక ప్పుడు చెక్ చేసుకుంటూ సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. చివరి 3 నెలల సమయంలో చాలా మందికి ఒంటికి నీరు పడుతుంది. అలాంటప్పుడు బార్లీ నీళ్లు, నిమ్మరసం తీసుకుంటే ఒంటికి పట్టిన నీరు తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ పళ్లు తినాలి. ఫోలిక్ఆసిడ్, ఐరన్ చాలా అవసరం కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లభ్యమయ్యే ఆహారపదార్ధాలు తీసుకోవడం అవసరం. ఉదయం పూట సిక్‌నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా జీర్ణమయ్యే ఇడ్లీ , పండ్లు లాంటివి తీసుకోవచ్చు. ఆయిల్ పదార్థాలు తీసుకోకూడదు. పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. చాలా కీలకమైన ఈ సమయంలో డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తల్లి ఆరోగ్యం బాగుండటంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.

గ్యాస్ట్రిక్ సమస్యకు.. గృహ చిట్కాలు – Gas problem tips in Telugu

గ్యాస్ట్రిక్ సమస్యకు.. గృహ చిట్కాలు – Gas problem tips in Telugu

Image result for gastritis
ఆహారం తినగానే భరించలేనంత ఛాతీలో నొప్పి..ఆ నొప్పి మొదలవ్వగానే మనకు ఏమైపోతుందోనని ఆందోళన మొదలవుతుంది. ఈ సమస్యే గ్యాస్ట్రి సమస్య. ఈ సమస్య సాధారణంగా జీర్ణాశయం ఖాళీగా ఉండటం వల్ల వస్తుంది. ఆఖరికి ఆరోగ్యవంతమైన మానవునికి సైతం ఈ సమస్య వల్ల ఇబ్బంది, చిరాకు వస్తుంది. దీనినే వైద్య పరిభాషలో దీన్నే గ్యాస్ట్రటిస్ అంటారు. గ్యాస్టోటిస్ అనగా జీర్ణకోశం లోపల ఉండే మ్యూకోసల్ పొరలు ఇన్‌ఫ్లమేషన్‌కు గురైనప్పుడు ఆ ప్రదేశంలో వాపు, కమిలిపోవడం, నొప్పి వంటి లక్షణాలు ఏర్పడతాయి.

ఈ సమస్య మానవుని ఏవిధంగా దెబ్బ తీస్తుంది?

ఈ సమస్య ఉత్పన్నమవటానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా మీరు తీసుకునే ఆహారం వల్ల కూడ మొదలవుతుంది. అందుచేత మీరు తీసుకునే ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి.

ఈ సమస్య ఉత్పన్నమవటానికి నిజమైన కారణాలు?

ఈ సమస్య సాధారణంగా ఉత్పన్నమవటానికి చాలా మంది ఆల్కాహాల్ ను సేవిస్తుంటారు. అంతేకాక ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీస్కోవటం, జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఉత్పన్నమవ్తుంది. అలాగే ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురికావటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అంతేకాక కొంతమంది తాము తీసుకునే ఆహారాన్ని సరిగ్గా నమలరు..ఇటువంటి పరిస్తితిలో సరిగ్గా ఆహారం అరగదు. అప్పుడు కూడా ఈ సమస్య మొదలవుతుంది.

అసలు ఎందుకీ సమస్య ఏర్పడుతుంది?

కొన్ని సందర్భాల్లో జీర్ణకోశంలో ప్రత్యేకించి ఏ వ్యాధి లేకపోయినా గ్యాస్ట్రిక్ లక్షణాలను అనుకరించడాన్నే ఫంక్షనల్ లేదా నాన్ అల్సర్ డిస్పెప్సియా అని అంటారు. మెదడులో ఉన్నట్టే జీర్ణవ్యవస్థలో కూడా అంతే సంఖ్యలో నరాలు ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటివి మెదడుతో పాటు జీర్ణవ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో గ్యాస్ ఉత్పత్తి అవ్వడం అనేది సాధారణ స్థితి. అయితే, ఇది శరీరంలో అధికమైతే అసలైన సమస్య అప్పుడే మొదలవుతుంది . గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల శరీరంలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. పొట్టలో అధిక ఆమ్లాలు ఉత్పత్తి కావడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక కడుపు ఉబ్బరంగా, పొట్ట ఉబ్బుకొని, ఉండటం మరియు పొట్ట నొప్పి వంటి అసౌకర్య లక్షణాలను ఎదుర్కోవల్సి వస్తుంది . ఇలాంటి పరిస్థితిల్లో ఎవరిని కలవకపోవడం. నలుగురిలో ఏదైనా తినాలున్నా, తినలేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

ఎప్పుడు ఈ సమస్య కనపడుతుంది?

కొంత మందిలో భోజనం చేసిన వెంటనే ఈ సమస్య కనబడుతుంటుంది . అలాంటి పరిస్థితిలో పొట్టలో గ్యాస్ మరియు ఇతర ఇబ్బందులకు ఎలాంటి ఆహారం కారణం అవుతున్నదో తెలుసుకోవడానికి కష్టం అవుతుంది. అయితే బంగాళదుంపలు, బీన్స్ మరియు కార్న్ వంటి ఆహారాలు గ్యాస్ కు కారణం అవుతాయి.

గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలు

ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలు ఎసిడిటి, కడుపులో మంట, గుండెలో మంట లాంటివి. కొన్ని గ్యాస్ట్రిక్ కారణాలేమంటే వైరల్ ఇంఫెక్షన్స్, ఫుడ్ పొయిజనింగ్, కిడ్నీ లో రాళ్ళు, అజీర్నం, త్యూమర్లు, అల్సర్లు లాంటివాటి వల్ల కూడా ఈ సమస్య కూడా మొదలవుతుంది. కొందరిలో ఒత్తిడి, అందోళన, సరిగ్గా ఆహారాన్ని నమలకపోవటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. గ్యాస్ సమస్య కొన్ని బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. ఉదాహరణకు హెచ్ పిలోరి అనే బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. నోటి దుర్వాసన, అజీర్ణం, వాంతులు, డయేరియా, నోటి పూత లాంటివి గ్యాస్ సమస్య లక్షణాలు.

సాధారణంగా గ్యాస్ట్రిక్ లక్షణాలు

1. నోటి దుర్వాసన
2. నోటి పూత
3. కడుపులో నొప్పి
4. త్రేన్పులు
5. మూత్రణాళం సమస్య
6. కడుపు ఉబ్బటం
గ్యాస్ సమస్య నుంచీ దూరంగా ఉండేందుకు కొన్ని గృహ చిట్కాలని పరిశీలిద్దామా..!

గ్యాస్ సమస్య నుంచీ తాత్కాలిక ఉపశమనం కోసం

నిమ్మ రసాన్ని వాడటం

మీ గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మ రసాన్ని వాడటం ఎంతో మంచిది. గ్యాస్ సమస్య ఉత్పన్నమయినప్పుడు ఒక నిమ్మకాయను తీసుకోండి, మొక్కలుగా కోసి దానిలో నుంచీ రసాన్ని తీసి వేసి తర్వత దానిలో సగం టేబుల్ స్పూన్ బేకింగ్ సోడ వేసి దానిలో కాస్త ఒక కప్ నీటిని వేసుకుని తర్వాత త్రాగితే చాలా మంచిది. దీనిని రోజూ ఉదయానే త్రాగితే చాలా మంచిది.

మూలికా టీలు

మీరు ఎప్పుడైనా మూలికా టీల గురించి విన్నారా? అవును మీ గ్యాస్ సమస్యకు మూలికా టీలు ఎంతో మంచివి. అవేంటంటే ఫాల్సా, రాస్బెర్రీల టీ, బ్లాక్ బెర్రీస్ చమోమిలి, మింట్ తో తయారు చేస్తారు. ఈ మూలికా టీలను ఎక్కువ సేపు మరిగించకూడదు. ఎందుకంటే దీనిలో ఉన్న మూలికా గుణాలు తగ్గిపోతాయి.

ఇప్పుడు పసుపు ఆకులు

పసుపు ఆకుల్ని తీసుకుని వాటిని గ్రైండ్ చేసి ఆ పొడిని తీసుకుని ఒక గ్లాస్ లో పాలు తీసుకుని దానిలో కలుపుకుని త్రాగితే ఎంతో మంచిది. ఇది ఎన్నో సంవత్సరాలుగా గ్యాస్ కు మంచి మందుగా మన తాతముత్తాతలు వాడి ఇది మంచి మందుగా చెప్పబడింది.

మంచి నీరు

మీ కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ సమస్య మొదలయినట్టే.. కాబట్టి మంచినీరు సరిగ్గా తీసుకుంటే ఈ సమస్య ఉండదు. అంతేకాక రోజూ 6 నుంచీ 8 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తదు.

అల్లం రూట్

గ్యాస్ సమస్యకు మంచి మందుగా మన వంటింట్లో ఉండే అల్లం ఎప్పుడూ మంచిది. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. అదే మీరు తిన్నగా నమలలేకపోతే వేరే సుగర్లో కలుపుకుని తినవచ్చు.

బంగాళాదుంప

బంగాళ దుంపల్ని తీసుకుని వాటిని గ్రైండ్ చేసుకుని ఆ జ్యూస్ ని రోజూ భోజనానికి ముందు త్రాగాలి. ఇలా చేస్తే చాలా చక్కగా గ్యాస్ సమస్యని తొలగించుకోవచ్చు.

ఉపవాసం

2 నుంచీ 3 రోజుల వరకూ ఉపవాసాలు ఉంటే కడుపు శుభ్రం అవుతుంది. ఇలా చేయటం వల్ల టాక్సిక్ యాసిడ్ లు బయటకు పోతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి చాలా చక్కటి సహజసిధ్ధమైన మందు. దీనిని తిన్నగా నమిలాలి. లేదా ఈ వెల్లుల్లి ముక్కలకు కొత్తిమీర విత్తనాలు, జీలకర్ర గింజల్ని తీసుకుని 5 నిముషాలపాటు ఉడికించిన జ్యూస్ మొత్తం తీసివేసిన తర్వాత త్రాగాలి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క గ్యాస్ సమస్యకు మంచి మందు. దాల్చిన చెక్కను తీసుకుని నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్ ను త్రాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు త్రాగితే మీ గ్యాస్ సమస్య పోతుంది. ఉదయాన్నే త్రాగాలి అనుకుంటే ఈ దాల్చిన పొడికి తోదుగా తేనె వేసుకుని త్రాగితే ఎంతో మంచిది. ఇలా నెల రోజులు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.

యాలుకలు

యాలుకల్ని సాధారణంగా అన్ని రెసిపీలలో వేస్తారు. ఇక దీనిని గ్యాస్ సమస్యకు మందుగా వాడవచ్చు. కొన్ని యాలుకల్ని రోజూ 2-3 సార్లు నములుతూ ఉంటే మీ గ్యాస్ సమస్య పోతుంది. అలాగే యాలుకల టీ కూడా త్రాగితే మంచిది.

పెప్పర్మింట్

పెప్పర్మింట్ టీ గ్యాస్ సమస్యకు ఎంతో మంచిది. దీనిని టీ గా తీసుకుంటే చాలా మంచిది. ఇది హెర్బల్
టీ కాబట్టి రోజుకు 2 నుంచీ 3 సార్లు త్రాగాలి.

కొబ్బరి నీళ్ళు

గ్యాస్ సమస్యను తీర్చేందుకు మంచి మందుగా కొబ్బరి నీళ్ళను చెప్పవచ్చు. దీనిలో అసాధారణ ప్రోటీన్లు ఉన్నాయి. రోజూ కొబ్బరి నీళ్ళని త్రాగటం అలవాటు చేసుకుంటే మంచిది.

యాపిల్ సైడర్ వెనిగర్

వేడినీటిలో మూడు టేబుల్ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని త్రాగాలి. ఇలా త్రాగటం వల్ల గ్యాస్ సమస్య తీరుతుంది.

మజ్జిగ

మజ్జిగలో క్యారం విత్తనాలు కలుపుకుని తర్వాత పేస్ట్ గా చేసుకోవాలి. అలాగే దీనికి నల్ల ఉప్పు కూడా కలుపుకోవాలి. రోజూ ఇలా త్రాగితే గ్యాస్ సమస్య కూడా తొలగిపోతుంది.

బేకింగ్ సోడ, నిమ్మ

ఒక గ్లాస్ లో బేకింగ్ సోడా కొంచెం వేసుకుని తర్వాత నిమ్మ రసాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రసాన్ని త్రాగితే చక్కగా గ్యాస్ సమస్య నయమవుతుంది. ఒకవేల మీకు అప్పటికప్పుడు వేగంగా గ్యాస్ తగ్గిపోవాలంటే ఒక గ్లాస్ లో పూర్తిగా నీటిని పోసి దానిలో బేకింగ్ సోడా వేసుకుని త్రాగాలి.

కొత్తిమీర

కొత్తిమీర మన వంటింట్లో వండే ప్రతీ వంటలో ఉండేదే. అయితే దీని సువాసన కూడా ఎంతో ఎక్కువ. అంతేకాక కొత్తిమీర అజీర్ణానికి చక్కగా పని చేస్తుంది. మీకు కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా చక్కగా తగ్గిపోతుంది. మీరు ఒక గ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని త్రాగితే మీరు ఈ సమస్య నుంచీ బయటపడవచ్చు.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు చాలా వంటల్లో వేయటం చూస్తూనే ఉంటాం. అయితే ఎండు మిరప కాయలు కూరల్లో వేయకుండా దీనిని కొందరు వేస్తారు. ఆరోగ్యపరంగా దీనిని వేస్తే మంచిది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రావటం వల్ల కడుపు మంట మొదలవుతుంది. కాబట్టి నల్ల మిరియాలు అజీర్ణానికి మంచిది. వీటిని పాలతో పాటూ త్రాగితే మంచిది. గ్యాస్ సమస్య తీరుతుంది.

ఇంగువ

కడుపులో నొప్పి అలాగే అజీర్ణంగా ఉంటే ఇంగువా చక్కటి మందు. ఇది ప్రతీ వంటింట్లో ఉండేదే. ఒక గ్లాస్ లో వేడినీటిని తీసుకుని దానిలో ఇంగువ వేసుకుని బాగా కలిపి త్రాగాలి. ఇలా త్రాగితే కడుపు నొప్పి, అజీర్ణం అన్ని పోతాయి.

సోపు గింజలు

సోపు గింజలు ప్రతీ ఇంటా దొరికేవే. సోపు గింజలు కొలెస్టరాల్ ను తగ్గిస్తాయి. రోజూ కాస్త సోపు గింజల్ని తినటం వల్ల మీకు గ్యాస్ సమస్య తొలగిపోతుంది. కొన్ని సోపు గింజల్ని తీసుకుని గ్రైండ్ చేసుకుని నీటితో త్రాగితే గ్యాస్ సమస్య తొలగుతుంది.

లవంగాలు

లవంగాలు ఔషధ లక్షణాలు కలది. ఇవి గ్యాస్ సమస్యని చక్కగా పోగొడతాయి. రోజూ మీరు తిన్నగా నమిలి తినవచ్చు. లేదా లవంగాల నూనెను గ్యాస్ సమస్యని తీర్చేందుకు వాడవచ్చు.

వాము విత్తనాలు

వాము వితానాల్ని కొంతమంది అజోవైన్ అనే పేరుతో పిలుస్తారు. ఇది కొన్ని సంవత్సరాలకు పూర్వం నుంచీ గ్యాస్ సమస్యకు మంచి ఔషధంగా చెప్పబడుతోంది. ఇవి అజీర్ణ సమస్యని తొలగిస్తాయి. ఇది చాలా శక్తివంతమైనది. మీరు ముందుగా వాము గింజల్ని తీసుకుని దానికి ఉప్పును కలుపుకుని ఈ మిశ్రమాన్ని మంచి నీటిలో కలుపుకొని త్రాగాలి. మీరు స్పైసీ వంటల్ని తిన్నప్పుడు దీనిని త్రాగితే గ్యాస్ సమస్య ఉండదు.

వేడి నీరు

వేడి నీరు చాలా మంచిది. మీరు స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు మీ కడుపు భారంగా ఉన్నప్పుడు, అలాగే మీకు బాగా అజీర్నంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ వేడినీటిని తీసుకుంటే ఆ నీరు కడుపులోనికి వెళ్ళి కొలెస్టరాల్ ను కరిగిస్తుంది. అంతేకాక రోజూ పరగడుపుతో వేడి నీటిని త్రాగితే పరిపూర్ణ ఆరోగ్యం, గ్యాస్ సమస్య ఉండదు

rampa chodavaram