Showing posts with label india. Show all posts
Showing posts with label india. Show all posts

Friday, December 29, 2017

మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండాలంటే?

మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండాలంటే?

Image result for kidneys
కొందరికి మూత్రానికి వెళ్తే మంట, మరికొందరికి మూత్రపిండాలలో ఇబ్బంది ఈ సమస్యలకు కారణం మీకు మూత్ర పిండాల సమస్య మొదలైదని అర్ధం. మనం చేసే అశ్రధ్ధ వల్లే ఈ సమస్య తెలెత్తుతుంది. మనం ఆచరించే అలవాట్లూ ఆహారమే వీటిపై ప్రభవం చూపిస్తాయి. మన మూత్రపిందాలు బాగుండాలతే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు. అవేంటో చూద్దమా..
1. మీ శరీరాన్ని శుభ్ర పరచేది నీరు మాత్రమే. కనుక, తగినన్ని ద్రవాలు తీసుకోవటం మీ కిడ్నీ లను శుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది.2. బ్లాక్ బీన్స్ మీ కిడ్నీల ఆరోగ్యానికి బ్లాక్ బీన్స్ తినటం మంచిది. వీటిలో ఫాస్ఫరస్ అతి తక్కువ అందువలన అవి కిడ్నీ లకు మంచిది.
3. తరచుగా మూత్రం పోయండి రోజులో ఎక్కువ సార్లు మూత్రం పోయటం కిడ్నీ ల ఆరోగ్యానికి మంచిది. అయితే ప్రతి సారి మీ మూత్రపు సంచి నిండి నిండి ఉందాలి.
4. నల్ల రంగు బెర్రీ లు దట్టమైన రంగులు కల ఆహారాలు సాధారణంగా మీ కిడ్నీలకు మంచిది. బ్లూ బెర్రీ లు, బ్లాక్ బెర్రీ లు, క్రాన్ బెర్రీ లు సిట్రస్ జాతికి చెంది అధిక అంటి ఆక్సిడెంట్ లు కలిగి ఉంటాయి. అవి కిడ్నీ సమస్యలను తొలగిస్తాయి.
5. కొత్తిమీర వాస్తవంలో మీ కిడ్నీలను శుభ్ర పరచేందుకు సహకరిస్తున్ది. కోరియందర్, పార్సిలీ , సిలాన్త్రో లు ఒకే జాతికి చెందినవి. ఇవి కిడ్నీల ఫిల్టర్ లను శుభ్ర పరుస్తాయి.
6. టేబుల్ సాల్ట్ లో కంటే సి సాల్ట్ లో సోడియం క్లోరైడ్ తక్కువ. కనుక మీరు కనుక కిడ్నీ రాళ్ళతో బాధ పడుతూంటే, సీ సాల్ట్ ఉపయోగించటం చాలా మంచిది.7. కారం కల మిర్చి తినటం కిడ్నీలకు మంచిది కాదు. అధిక మసాలా ఆహారాలు మీ లివర్, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి. కనుక మీ ఆహారంలో తగుమాత్రం కారాలు ఉండేలా చూసుకోండి.
8. సిగరెట్ లలో కాడ్ మియం అనే మెటల్ వుంటుంది. అది మీ కిడ్నీల లైనింగ్ లో డిపాజిట్ అవుతుంది . కిడ్నీల పనిని ఇది మందగిస్తుంది. రీనల్ ఫెయిల్యూర్ కు కూడా దోవ తీస్తుంది.
9. అరుగుల అనేది ఒక పచ్చని ఆకు కూర అది మీ కిడ్నీల లోని టాక్సిన్ లను బయటకు పంపుతుంది. అరుగుల కనుక రెగ్యులర్ గా తింటే కిడ్నీ సమస్యలతో బాధలు పడే వారికి మంచి రిలీఫ్ కలుగుతుంది.
10. మూత్రము ను ఆపు కొనవద్దు కొంతమందికి మూత్రంను ఎక్కువ సమయం ఆపుకొనే అలవాటు వుంటుంది ఇది చెడు అలవాతు. అది మీ కిడ్నీ లపై ఒత్తిడి కలిగిస్తుంది.11. మస్టర్డ్ గ్రీన్స్ ఆకు కూరలో విటమిన్ కె అధికం. ఇది కిడ్నీ లకు బ్లడ్ సరఫరా అధికం చేస్తుంది.
12. కిడ్నీ లను ఎలా సంరక్షించు కోవాలి అని మీరు ఒత్తిడికి గురవుతూంటే, ముందుగా మీరు కొంత రిలాక్స్ అవటం ఎంతో మంచిది. కిడ్నీలు డామేజ్ అయ్యేటందుకు ఒత్తిడి ఒక ప్రధాన కారణం. కనుక రిలాక్స్ అయి ఒత్తిడికి దూరంగా వుండి కిడ్నీలు బాగా పని చేసేలా చూసుకోండి.
13. రెడ్ కేబెజ్ మీకు కనుక డయాబెటిస్ ఉన్నట్లయితే మీ కిడ్నీలు వేగంగా చెడిపోయే అవకాశం వుంది. కేబెజ్ వంటి ఆకు కూరలు కిడ్నీల డామేజ్ ని అరికడతాయి
14. మీ కిడ్నీ లు సరిగ్గా మీ హిప్ ల పైన వీపు దిగువ భాగంలో వుంటాయి. కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ వ్యామాలు చేస్తే, కిడ్నీలు సవ్యంగా పని చేసే అవకాశం వుంటుంది .
15. అలసిన మీ శరీర కణాల పునరుజ్జీవానికి చక్కటి శరీర విశ్రాంతి అవసరం. కనుక బాగా నిద్రించండి. మీ ఇతర శరీర అవయవాల వలెనె, కిడ్నీ లు కూడా అధిక పని చేస్తే అలసి పోతాయి. కనుక ప్రతి రోజూ 8 గంటల పాటు తప్పక విశ్రాంతి తీసుకోండి.
16. యోగ లోని కొన్ని భంగిమలు కిడ్నీ లు సవ్యంగా పని చేసేలా చెస్తాయి. మీ కిడ్నీల మంచి పని తీరుకు క్రేన్, క్రేసేంట్ లున్గే భంగిమలు రెండూ బాగా పని చేస్తాయి.

Wednesday, December 27, 2017

ఆస్థమా ఉన్నవారు తీసుకోవల్సిన జాగ్రత్తలు

ఆస్థమా ఉన్నవారు తీసుకోవల్సిన జాగ్రత్తలు

Image result for asthma care
ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
ఊపిరితిత్తులు మనం బతకడానికి కావలసిన ప్రాణవాయువుని శ్వాస ప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతి రోజూ మన శ్వాస కోశాలు వివిధ రకమైన వాతావరణ పరిస్థితులకు, ఎలర్జెన్స్‌కి, రసాయ నాలకి, పొగ, దుమ్ము, ధూళి తదితర వాటికి లోనవుతుంటా యి. వీటి వలన వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.ఆస్థమా సర్వసాధారణమైన దీర్ఘకాలిక జబ్బులలో ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తులలోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జెన్స్‌) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతి చర్యగా మన శరీరం స్పందించి వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తుంది.
ఆస్థమా వల్ల వచ్చే ఇబ్బందులు:
1. ఆస్థమా ప్రభావం వలన మన శ్వాస నాళాలు కుంచించుకొని పోతాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
2. ఆస్థమా ఉన్నవారిలో తరచుగా ఆయాసం రావడం, పిల్లి కూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేక పోవడం లేదా వ్యాయామం చేస్తే ఆయాసం రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
3. వీరిలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుంచి నీరు కారడం, తరచుగా జలుబు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి. చాలా మందిలో ఈ ఆస్థమా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
వాతావరణ కాలుష్యం ప్రభావం:
1. ఇంటి లోపలి గాలి కాలుష్యం వలన కూడా ఆస్థమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
2. ఇల్లు ఊడ్చడం వలన, గ్యాస్‌ స్టవ్‌ వాడడం వలన, వేపుడులు చేయడం వలన, అగరబత్తీలు వాడడం, ధూమపానం, వంట చేయడం వలన వచ్చే పొగలు తదితరాలు
3. అలాగే గాలిలోకి పార్టి క్యులేట్‌ మెటీరియల్స్‌, రసాయనాలు, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, ఓజోన్‌ వంటి వాటిని విడుదల చేస్తాయి. వీటి వలన ఆస్థమా పెరగవచ్చు.
4. ఇంట్లో వాడే ఎయిర్‌ ఫ్రెష్‌నర్స్‌, అయోనైజర్స్‌, జిరా క్స్‌ యంత్రాలు, ఎయిర్‌ క్లీనర్స్‌, ఫిల్టర్స్‌, ప్యూరిఫయర్స్‌ తదితర వాటి వలన ఇంట్లో ఓజోన్‌ ఉత్పత్తి అవుతుంది. బయటి వాతా వరణం కాలుష్యం వలన ఆస్థమా చాలా పెరుగుతుంది.
5. డీజిల్‌ వాహనాల వలన గాలిలోని పార్టిక్యు లేట్‌ మేటర్‌, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, సల్ఫర్‌ డై ఆకై్సడ్‌, సీసం పొగ లు, కార్బన్‌ మోనాకై్సడ్‌ వంటివి సూర్యరశ్మితో చర్య జరిగి ఓ జోన్‌, పొగమంచును విడుదల చేస్తాయి. వీటి వలన బ్రాంకై టిస్‌, ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నింటి వలన వేసవిలో ఆస్థమా వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంది.
6. ఆస్థమా ఉన్నవారు జబ్బుని సరిగా అదుపులో ఉంచుకొనకపో యినా, దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేసినా, ఎయిర్‌ వే రీమోడలింగ్‌ జరిగి సిఒపిడిగా పరిణామం చెంది తద్వారా గుండె ఫెయిల్‌ అవుతుంది. చిన్న పిల్లలో ఎదుగుదల, చురుకుదనం తగ్గుతాయి. తరచూ వచ్చే ఆయాసం వలన వృత్తికి లేదా బడికి సెలవు పెట్టడం తద్వారా కెరీర్‌ దెబ్బతినడం, కుటుంబ వైద్య ఖర్చులు పెరగడం జరుగుతుంది.
ఆస్థమాలో రకాలు…
ఎలర్జిక్‌, నాన్‌ ఎలర్జిక్‌ ఆస్థమా, యర్లీ, ఆన్‌సెట్‌ ఆస్థమా, వ్యాయామం వలన వచ్చే ఆస్థమా, పొడిదగ్గులాగా వచ్చే ఆస్థమా, వృత్తి ఆస్థమా, స్టిరాయిడ్‌ రెసిస్టెంట్‌ ఆస్థమాలు నేడు వస్తున్నాయి. వీటన్నింటిని సరిగా కనుక్కొని మందులను వాడుకోవాలి.
జాగ్రత్తలు…
1. ధూమపానానికి, ధూమపానం చేసేవారికి దూరం గా ఉండాలి.
2. డస్ట్‌మైట్స్‌ రాకుండా దుప్పట్లు, దిండ్ల కవర్లు ప్రతివారం వేడినీటిలో తరచూ ఉతికి ఎండలో ఆరబెట్టాలి.
3. ఇంట్లో తివాచీలు ఉంచకూడదు. దుమ్మదూళికి దూరంగా ఉండా లి. ముఖ్యంగా పాత పుస్తకాలు, పేపర్ల జోలికి వెళ్లకూడదు.
4. ఇల్లు ఊడవడానికి బదులు తడిగుడ్డతో తుడుచుకోవడం లేదా వాక్యూమ్‌ క్లీనర్స్‌ వాడుకోవడం మంచిది. ఇంట్లఒ బూజులు దులపడం లాంటివి ఆస్థమా ఉన్నవారు చేయకూడదు. ముక్కు కి గుడ్డ కట్టుకొంటే మంచిది.
5. పెంపుడు జంతువులని సాధ్యమై నంత దూరంగా ఉంచాలి. ఇంట్లో పురుగు మందులను స్ప్రే చేసేటప్పుడు ఇంట్లో ఉండకూడదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రిజ్‌ వాటర్‌ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉన్న కాలంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిది.

యువత ఆరోగ్యంగా ఉండాలంటే?

యువత ఆరోగ్యంగా ఉండాలంటే?

Image result for youth care

మానవ జీవిత చక్రంలో అతి కీలకమైన వయస్సు యవ్వనం. అది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే యువత ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. నేటి యువత ఆరోగ్యం వారు తీసుకునే పౌష్టికాహారంలోనే ఉంటుంది. యవ్వనంలో ఉన్న స్త్రీ పురుషులిద్దరికీ ఈ ఆరోగ్య చిట్కాలను అందిస్తున్నాం. మరి ఆ పౌష్టికాహారం ఏమిటో తెలుసుకుందామా..
1. మొదట ఆరోగ్యం మీ చెంత చేరాలంటే మీ కడుపులో మలం ఉంటే మీరు ఎంత తిన్నా, మంచి పౌష్టికాహారం తీసుకున్నా ఏమాత్రం ఫలితం లేదంటున్నారు వైద్యులు. భోజనం తినేటప్పుడు బాగా నమిలి తినాలి, దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి సరిగా లేకపోతే మందులు వాడాల్సివస్తుంది.2. పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒకస్పూన్ నెయ్యి కలుపుకుని తాగాలి.
3. పాల మీగడతోటి కలకండను కలుపుకుని తీసుకుంటే శరీరానికి మంచి బలాన్నిస్తుంది.
4. రెండు స్పూన్ల ఎర్రగడ్డ రసం, ఒక స్పూన్ తేనె, కాసింత నెయ్యి కలిపి తీసుకుంటే యోని శక్తి వృద్ధి చెందుతుంది.
5. చిలగ్గొట్టిన మజ్జిగ నుంచి వచ్చిన వెన్నతోబాటు కలకండ కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత నీటిని తాగకూడదు.
6. అరలీటరు పాలలో 50 గ్రాముల ఉద్దిపప్పు వేసి ఉడకబెట్టిం తర్వాత దానిని పాయసంలాగా త్రాగండి. దీనివలన శరీరానికి మంచి బలం చేకూరుతుంది.
7. 1/4 లీటరు పాలలో ఒక స్పూను అశ్వగంధ చూర్ణం, ఒక స్పూను కలకండ కలిపి ఉదయం..రాత్రిపూట తీసుకుంటే మార్పు కనపడుతుంది. ఇలా 40 రోజులు తీసుకోవాలి. ఈ పదార్థాం తీసుకున్నతర్వాత రాత్రి నోరు పుక్కలించి పడుకోవాలి.
8. ఉదయం పూట 1/4 లీటరు పాలతోబాటు రెండు..మూడు అరటిపండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ముఖంపై కాంతి కూడా బాగా పెరుగుతుంది.
9. ఉదయంపూట 1/4 లీటరు చల్లటి పాలలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రక్త శాతం వృద్ధి చెందుతుంది.
10.ఉదయం..రాత్రి భోజనం తర్వాత ఆపిల్, దానిమ్మ, అరటి, లేక ఏదైనా ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలి.
11.బాదం పప్పును రాతిమీద అరగదీసి పాలల్లో కలుపుకుని తాగాలి. దీంతో అపారమైన శక్తి లభిస్తుంది

మీకు పుట్టబోయే బిడ్డ కోసం ఆహార నియమాలు

మీకు పుట్టబోయే బిడ్డ కోసం ఆహార నియమాలు

Image result for pragnant woman

ఫ్రతి స్త్రీకి నూటికి నూరు మార్కులు వచ్చేది సంతాన ప్రాప్తితోనే. అందుకే ఆడది సంతానం కోసం తపిస్తుంది. ఏది ఏమైనా సంతానం లేకపోతే బ్రతకలేనంటుంది. సంతానం పోందేందుకు ఎన్ని కష్టనష్టాలనైనా ఓర్పుతో సహించి నిండు మాసాలూ బరువు మోసి ఓ ప్రాణాన్ని ఇలలోనికి తెస్తుంది. మరి ఆ బిడ్డ పుట్టేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలేమితో చూద్దామా..గర్భం దాల్చారని తెలుసుకునేలోపే మూడు నెలలు గడిచిపోతాయి. చాలా మంది విషయంలోనూ ఇలానే జరుగుతుంది. కొంత మంది మాత్రం ప్రెగ్నెసీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడతారు. నిజానికి అలా చేయడం చాలా ముఖ్యం. హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకు మందులు వాడుతూ ప్రెగ్నెసీ కోసం ప్రయత్నించాలి.
గర్భం దాల్చాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. మొదటి 3 నెలల్లో అదనపు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సమతుల ఆహారం తీసుకోవాలి. గర్భం దాల్చిన వారికి ఫోలిక్ ఆసిడ్, ఐరన్ చాలా అవసరం. కాబట్టి ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. క్యాబేజీ, బత్తాయి, ఖర్జూర, మాంసాహారం తీసుకుంటే మంచిది. అలాగే హీమోగ్లోబిన్ శాతం సరియైన స్థాయిలో ఉందో లేదో పరీక్ష చేయించుకోవాలి. ఐరన్ కోసం డేట్స్ తీసుకోవచ్చు. ఈ మొదటి 3నెలల సమయంలో అదనపు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ వెయిట్ ఉండేలా చూసుకోవాలి.ఈ సమయంలో కూడా అదనపు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. సమతుల ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అలాగే బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతి రోజు ధాన్యపు గింజలు, రాగులతో చేసిన ఆహారం తీసుకోవాలి. రాగులలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా దొరుకుతుంది. తాజా పండ్లు తీసుకోవడం కూడా చాలా అవసరం. పాలు, పెరుగు తప్పకుండా తీసుకోవాలి. పాల ఉత్పత్తులను ప్రతి రోజు 300 ఎంఎల్ తీసుకుంటే గర్భిణిలకు చాలా మంచిది. ప్రోటీన్స్ సమృద్ధిగా లభ్యమయ్యే పప్పుధాన్యాలు, మాంసాహారం, చేపలు, గుడ్లు మెనూలో ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ పదార్థాలు, స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి.
ఈ సమయంలో బిడ్డ పెరుగుదల వేగంగా ఉంటుంది. ఇప్పుడు బిడ్డకు కూడా ఆహారం అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అదనపు ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో బరువు తగ్గడం మంచిది కాదు. బరువును ఎప్పటిక ప్పుడు చెక్ చేసుకుంటూ సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. చివరి 3 నెలల సమయంలో చాలా మందికి ఒంటికి నీరు పడుతుంది. అలాంటప్పుడు బార్లీ నీళ్లు, నిమ్మరసం తీసుకుంటే ఒంటికి పట్టిన నీరు తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ పళ్లు తినాలి. ఫోలిక్ఆసిడ్, ఐరన్ చాలా అవసరం కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లభ్యమయ్యే ఆహారపదార్ధాలు తీసుకోవడం అవసరం. ఉదయం పూట సిక్‌నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా జీర్ణమయ్యే ఇడ్లీ , పండ్లు లాంటివి తీసుకోవచ్చు. ఆయిల్ పదార్థాలు తీసుకోకూడదు. పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. చాలా కీలకమైన ఈ సమయంలో డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తల్లి ఆరోగ్యం బాగుండటంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.

గ్యాస్ట్రిక్ సమస్యకు.. గృహ చిట్కాలు – Gas problem tips in Telugu

గ్యాస్ట్రిక్ సమస్యకు.. గృహ చిట్కాలు – Gas problem tips in Telugu

Image result for gastritis
ఆహారం తినగానే భరించలేనంత ఛాతీలో నొప్పి..ఆ నొప్పి మొదలవ్వగానే మనకు ఏమైపోతుందోనని ఆందోళన మొదలవుతుంది. ఈ సమస్యే గ్యాస్ట్రి సమస్య. ఈ సమస్య సాధారణంగా జీర్ణాశయం ఖాళీగా ఉండటం వల్ల వస్తుంది. ఆఖరికి ఆరోగ్యవంతమైన మానవునికి సైతం ఈ సమస్య వల్ల ఇబ్బంది, చిరాకు వస్తుంది. దీనినే వైద్య పరిభాషలో దీన్నే గ్యాస్ట్రటిస్ అంటారు. గ్యాస్టోటిస్ అనగా జీర్ణకోశం లోపల ఉండే మ్యూకోసల్ పొరలు ఇన్‌ఫ్లమేషన్‌కు గురైనప్పుడు ఆ ప్రదేశంలో వాపు, కమిలిపోవడం, నొప్పి వంటి లక్షణాలు ఏర్పడతాయి.

ఈ సమస్య మానవుని ఏవిధంగా దెబ్బ తీస్తుంది?

ఈ సమస్య ఉత్పన్నమవటానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా మీరు తీసుకునే ఆహారం వల్ల కూడ మొదలవుతుంది. అందుచేత మీరు తీసుకునే ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి.

ఈ సమస్య ఉత్పన్నమవటానికి నిజమైన కారణాలు?

ఈ సమస్య సాధారణంగా ఉత్పన్నమవటానికి చాలా మంది ఆల్కాహాల్ ను సేవిస్తుంటారు. అంతేకాక ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీస్కోవటం, జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఉత్పన్నమవ్తుంది. అలాగే ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురికావటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అంతేకాక కొంతమంది తాము తీసుకునే ఆహారాన్ని సరిగ్గా నమలరు..ఇటువంటి పరిస్తితిలో సరిగ్గా ఆహారం అరగదు. అప్పుడు కూడా ఈ సమస్య మొదలవుతుంది.

అసలు ఎందుకీ సమస్య ఏర్పడుతుంది?

కొన్ని సందర్భాల్లో జీర్ణకోశంలో ప్రత్యేకించి ఏ వ్యాధి లేకపోయినా గ్యాస్ట్రిక్ లక్షణాలను అనుకరించడాన్నే ఫంక్షనల్ లేదా నాన్ అల్సర్ డిస్పెప్సియా అని అంటారు. మెదడులో ఉన్నట్టే జీర్ణవ్యవస్థలో కూడా అంతే సంఖ్యలో నరాలు ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటివి మెదడుతో పాటు జీర్ణవ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో గ్యాస్ ఉత్పత్తి అవ్వడం అనేది సాధారణ స్థితి. అయితే, ఇది శరీరంలో అధికమైతే అసలైన సమస్య అప్పుడే మొదలవుతుంది . గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల శరీరంలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. పొట్టలో అధిక ఆమ్లాలు ఉత్పత్తి కావడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక కడుపు ఉబ్బరంగా, పొట్ట ఉబ్బుకొని, ఉండటం మరియు పొట్ట నొప్పి వంటి అసౌకర్య లక్షణాలను ఎదుర్కోవల్సి వస్తుంది . ఇలాంటి పరిస్థితిల్లో ఎవరిని కలవకపోవడం. నలుగురిలో ఏదైనా తినాలున్నా, తినలేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

ఎప్పుడు ఈ సమస్య కనపడుతుంది?

కొంత మందిలో భోజనం చేసిన వెంటనే ఈ సమస్య కనబడుతుంటుంది . అలాంటి పరిస్థితిలో పొట్టలో గ్యాస్ మరియు ఇతర ఇబ్బందులకు ఎలాంటి ఆహారం కారణం అవుతున్నదో తెలుసుకోవడానికి కష్టం అవుతుంది. అయితే బంగాళదుంపలు, బీన్స్ మరియు కార్న్ వంటి ఆహారాలు గ్యాస్ కు కారణం అవుతాయి.

గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలు

ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలు ఎసిడిటి, కడుపులో మంట, గుండెలో మంట లాంటివి. కొన్ని గ్యాస్ట్రిక్ కారణాలేమంటే వైరల్ ఇంఫెక్షన్స్, ఫుడ్ పొయిజనింగ్, కిడ్నీ లో రాళ్ళు, అజీర్నం, త్యూమర్లు, అల్సర్లు లాంటివాటి వల్ల కూడా ఈ సమస్య కూడా మొదలవుతుంది. కొందరిలో ఒత్తిడి, అందోళన, సరిగ్గా ఆహారాన్ని నమలకపోవటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. గ్యాస్ సమస్య కొన్ని బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. ఉదాహరణకు హెచ్ పిలోరి అనే బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. నోటి దుర్వాసన, అజీర్ణం, వాంతులు, డయేరియా, నోటి పూత లాంటివి గ్యాస్ సమస్య లక్షణాలు.

సాధారణంగా గ్యాస్ట్రిక్ లక్షణాలు

1. నోటి దుర్వాసన
2. నోటి పూత
3. కడుపులో నొప్పి
4. త్రేన్పులు
5. మూత్రణాళం సమస్య
6. కడుపు ఉబ్బటం
గ్యాస్ సమస్య నుంచీ దూరంగా ఉండేందుకు కొన్ని గృహ చిట్కాలని పరిశీలిద్దామా..!

గ్యాస్ సమస్య నుంచీ తాత్కాలిక ఉపశమనం కోసం

నిమ్మ రసాన్ని వాడటం

మీ గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మ రసాన్ని వాడటం ఎంతో మంచిది. గ్యాస్ సమస్య ఉత్పన్నమయినప్పుడు ఒక నిమ్మకాయను తీసుకోండి, మొక్కలుగా కోసి దానిలో నుంచీ రసాన్ని తీసి వేసి తర్వత దానిలో సగం టేబుల్ స్పూన్ బేకింగ్ సోడ వేసి దానిలో కాస్త ఒక కప్ నీటిని వేసుకుని తర్వాత త్రాగితే చాలా మంచిది. దీనిని రోజూ ఉదయానే త్రాగితే చాలా మంచిది.

మూలికా టీలు

మీరు ఎప్పుడైనా మూలికా టీల గురించి విన్నారా? అవును మీ గ్యాస్ సమస్యకు మూలికా టీలు ఎంతో మంచివి. అవేంటంటే ఫాల్సా, రాస్బెర్రీల టీ, బ్లాక్ బెర్రీస్ చమోమిలి, మింట్ తో తయారు చేస్తారు. ఈ మూలికా టీలను ఎక్కువ సేపు మరిగించకూడదు. ఎందుకంటే దీనిలో ఉన్న మూలికా గుణాలు తగ్గిపోతాయి.

ఇప్పుడు పసుపు ఆకులు

పసుపు ఆకుల్ని తీసుకుని వాటిని గ్రైండ్ చేసి ఆ పొడిని తీసుకుని ఒక గ్లాస్ లో పాలు తీసుకుని దానిలో కలుపుకుని త్రాగితే ఎంతో మంచిది. ఇది ఎన్నో సంవత్సరాలుగా గ్యాస్ కు మంచి మందుగా మన తాతముత్తాతలు వాడి ఇది మంచి మందుగా చెప్పబడింది.

మంచి నీరు

మీ కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ సమస్య మొదలయినట్టే.. కాబట్టి మంచినీరు సరిగ్గా తీసుకుంటే ఈ సమస్య ఉండదు. అంతేకాక రోజూ 6 నుంచీ 8 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తదు.

అల్లం రూట్

గ్యాస్ సమస్యకు మంచి మందుగా మన వంటింట్లో ఉండే అల్లం ఎప్పుడూ మంచిది. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. అదే మీరు తిన్నగా నమలలేకపోతే వేరే సుగర్లో కలుపుకుని తినవచ్చు.

బంగాళాదుంప

బంగాళ దుంపల్ని తీసుకుని వాటిని గ్రైండ్ చేసుకుని ఆ జ్యూస్ ని రోజూ భోజనానికి ముందు త్రాగాలి. ఇలా చేస్తే చాలా చక్కగా గ్యాస్ సమస్యని తొలగించుకోవచ్చు.

ఉపవాసం

2 నుంచీ 3 రోజుల వరకూ ఉపవాసాలు ఉంటే కడుపు శుభ్రం అవుతుంది. ఇలా చేయటం వల్ల టాక్సిక్ యాసిడ్ లు బయటకు పోతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి చాలా చక్కటి సహజసిధ్ధమైన మందు. దీనిని తిన్నగా నమిలాలి. లేదా ఈ వెల్లుల్లి ముక్కలకు కొత్తిమీర విత్తనాలు, జీలకర్ర గింజల్ని తీసుకుని 5 నిముషాలపాటు ఉడికించిన జ్యూస్ మొత్తం తీసివేసిన తర్వాత త్రాగాలి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క గ్యాస్ సమస్యకు మంచి మందు. దాల్చిన చెక్కను తీసుకుని నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్ ను త్రాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు త్రాగితే మీ గ్యాస్ సమస్య పోతుంది. ఉదయాన్నే త్రాగాలి అనుకుంటే ఈ దాల్చిన పొడికి తోదుగా తేనె వేసుకుని త్రాగితే ఎంతో మంచిది. ఇలా నెల రోజులు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.

యాలుకలు

యాలుకల్ని సాధారణంగా అన్ని రెసిపీలలో వేస్తారు. ఇక దీనిని గ్యాస్ సమస్యకు మందుగా వాడవచ్చు. కొన్ని యాలుకల్ని రోజూ 2-3 సార్లు నములుతూ ఉంటే మీ గ్యాస్ సమస్య పోతుంది. అలాగే యాలుకల టీ కూడా త్రాగితే మంచిది.

పెప్పర్మింట్

పెప్పర్మింట్ టీ గ్యాస్ సమస్యకు ఎంతో మంచిది. దీనిని టీ గా తీసుకుంటే చాలా మంచిది. ఇది హెర్బల్
టీ కాబట్టి రోజుకు 2 నుంచీ 3 సార్లు త్రాగాలి.

కొబ్బరి నీళ్ళు

గ్యాస్ సమస్యను తీర్చేందుకు మంచి మందుగా కొబ్బరి నీళ్ళను చెప్పవచ్చు. దీనిలో అసాధారణ ప్రోటీన్లు ఉన్నాయి. రోజూ కొబ్బరి నీళ్ళని త్రాగటం అలవాటు చేసుకుంటే మంచిది.

యాపిల్ సైడర్ వెనిగర్

వేడినీటిలో మూడు టేబుల్ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని త్రాగాలి. ఇలా త్రాగటం వల్ల గ్యాస్ సమస్య తీరుతుంది.

మజ్జిగ

మజ్జిగలో క్యారం విత్తనాలు కలుపుకుని తర్వాత పేస్ట్ గా చేసుకోవాలి. అలాగే దీనికి నల్ల ఉప్పు కూడా కలుపుకోవాలి. రోజూ ఇలా త్రాగితే గ్యాస్ సమస్య కూడా తొలగిపోతుంది.

బేకింగ్ సోడ, నిమ్మ

ఒక గ్లాస్ లో బేకింగ్ సోడా కొంచెం వేసుకుని తర్వాత నిమ్మ రసాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రసాన్ని త్రాగితే చక్కగా గ్యాస్ సమస్య నయమవుతుంది. ఒకవేల మీకు అప్పటికప్పుడు వేగంగా గ్యాస్ తగ్గిపోవాలంటే ఒక గ్లాస్ లో పూర్తిగా నీటిని పోసి దానిలో బేకింగ్ సోడా వేసుకుని త్రాగాలి.

కొత్తిమీర

కొత్తిమీర మన వంటింట్లో వండే ప్రతీ వంటలో ఉండేదే. అయితే దీని సువాసన కూడా ఎంతో ఎక్కువ. అంతేకాక కొత్తిమీర అజీర్ణానికి చక్కగా పని చేస్తుంది. మీకు కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా చక్కగా తగ్గిపోతుంది. మీరు ఒక గ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని త్రాగితే మీరు ఈ సమస్య నుంచీ బయటపడవచ్చు.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు చాలా వంటల్లో వేయటం చూస్తూనే ఉంటాం. అయితే ఎండు మిరప కాయలు కూరల్లో వేయకుండా దీనిని కొందరు వేస్తారు. ఆరోగ్యపరంగా దీనిని వేస్తే మంచిది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రావటం వల్ల కడుపు మంట మొదలవుతుంది. కాబట్టి నల్ల మిరియాలు అజీర్ణానికి మంచిది. వీటిని పాలతో పాటూ త్రాగితే మంచిది. గ్యాస్ సమస్య తీరుతుంది.

ఇంగువ

కడుపులో నొప్పి అలాగే అజీర్ణంగా ఉంటే ఇంగువా చక్కటి మందు. ఇది ప్రతీ వంటింట్లో ఉండేదే. ఒక గ్లాస్ లో వేడినీటిని తీసుకుని దానిలో ఇంగువ వేసుకుని బాగా కలిపి త్రాగాలి. ఇలా త్రాగితే కడుపు నొప్పి, అజీర్ణం అన్ని పోతాయి.

సోపు గింజలు

సోపు గింజలు ప్రతీ ఇంటా దొరికేవే. సోపు గింజలు కొలెస్టరాల్ ను తగ్గిస్తాయి. రోజూ కాస్త సోపు గింజల్ని తినటం వల్ల మీకు గ్యాస్ సమస్య తొలగిపోతుంది. కొన్ని సోపు గింజల్ని తీసుకుని గ్రైండ్ చేసుకుని నీటితో త్రాగితే గ్యాస్ సమస్య తొలగుతుంది.

లవంగాలు

లవంగాలు ఔషధ లక్షణాలు కలది. ఇవి గ్యాస్ సమస్యని చక్కగా పోగొడతాయి. రోజూ మీరు తిన్నగా నమిలి తినవచ్చు. లేదా లవంగాల నూనెను గ్యాస్ సమస్యని తీర్చేందుకు వాడవచ్చు.

వాము విత్తనాలు

వాము వితానాల్ని కొంతమంది అజోవైన్ అనే పేరుతో పిలుస్తారు. ఇది కొన్ని సంవత్సరాలకు పూర్వం నుంచీ గ్యాస్ సమస్యకు మంచి ఔషధంగా చెప్పబడుతోంది. ఇవి అజీర్ణ సమస్యని తొలగిస్తాయి. ఇది చాలా శక్తివంతమైనది. మీరు ముందుగా వాము గింజల్ని తీసుకుని దానికి ఉప్పును కలుపుకుని ఈ మిశ్రమాన్ని మంచి నీటిలో కలుపుకొని త్రాగాలి. మీరు స్పైసీ వంటల్ని తిన్నప్పుడు దీనిని త్రాగితే గ్యాస్ సమస్య ఉండదు.

వేడి నీరు

వేడి నీరు చాలా మంచిది. మీరు స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు మీ కడుపు భారంగా ఉన్నప్పుడు, అలాగే మీకు బాగా అజీర్నంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ వేడినీటిని తీసుకుంటే ఆ నీరు కడుపులోనికి వెళ్ళి కొలెస్టరాల్ ను కరిగిస్తుంది. అంతేకాక రోజూ పరగడుపుతో వేడి నీటిని త్రాగితే పరిపూర్ణ ఆరోగ్యం, గ్యాస్ సమస్య ఉండదు

Telugu tips for pregnant women

 Telugu tips for pregnant women

Image result for pragnant woman
తల్లి అనిపించుకున్నప్పుడే ఆడజన్మకు సార్థకత. అమ్మతనం కోసం ప్రతి స్త్రీ తపిస్తుంది, తపస్సు చేస్తుంది. అమ్మతనం పొందిన దగ్గర్నుండి ప్రసవ సమయం వరకు బిడ్డ క్షేమం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతి స్త్రీ అమ్మగా తన జన్మ పండించుకోవాలని ఆరాటపడుతుంది. బిడ్డ తల్లిలో అంతర్భాగం. గర్భావధికాలంలో తల్లి ద్వారానే ఆహారం, ఆయువును బిడ్డ పొందుతుంది. అమ్మలు, అమ్మమ్మలు, స్నేహితులు, అందరి దగ్గర నుండి కావల్సినన్ని సలహాలు వస్తుంటాయి. వారి అనుభవాలను ఇలా ఇతర గర్భీణీ స్త్రీలకు సలహాల రూపంలో ఇస్తుంటారు. అంతే కాకుండా మొదటి సారి గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి సందేహాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గర్భం దాల్చిన స్త్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఎలాంటి లోపానికి గురికాకుండా వైద్యుల పర్యవేక్షణలో వారు నిర్దేశించిన సమయాలలో పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తల్లి గర్భం సురక్షితమైనదే అయినప్పటికీ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుగు టిప్స్ ప్రేత్యేకంగా మీకు అందిస్తొంది..అవేంటో చూద్దామా..!

గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రక్తహీనత పరీక్షలు

గర్భం ధరించిన స్త్రీలు ముఖ్యంగా చేయించుకోవాల్సిన పరీక్ష రక్తహీనత పరీక్షలు. గ్రామాలలో నిర్దేశించబడిన రోజులలో హీమోగ్లోబిన్ స్థాయిని పరీక్షించే సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ రోజుల్లో తప్పక పరీక్ష చేయించుకోవాలి. ఒక వేళ అందుబాటులో లేనట్లయితే ఏరియా ఆసుపత్రిలో కానీ ఏదేని పరీక్షా కేంద్రాల్లోకానీ చేయించుకోవాలి. ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా కల ఆహార పదార్థాలు తినాలి. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలి. రోజూ ఒక గుడ్డు తినాలి. రోజూ పండ్లు కూడా తినాలి. ఆరు బయట నడిచేటప్పుడు ఎప్పుడూ చెప్పులు వేసుకోవాలి.మొలలు, అధిక రక్తస్రావం, మలేరియా వంటి సమస్యలకు చికిత్స తీసుకోవాలి. కాన్పు తర్వాత నాల్గవ నెల నుండి మూడు నెలల వరకు 100 ఎం.జి. ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వాడాలి. గర్భిణీ స్త్రీలకి సకాలంలో టి.టి. ఇంజక్షను ఇప్పించాలి. (రెండు మోతాదులు ఒక నెల వ్యవధిలో)ఇప్పించాలి.

గర్భిణీ స్త్రీలకి పోషకాహార లోపం వలన కలిగే నష్టాలు

1. రక్తహీనత
2. కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవుట
3. కాన్పు జరిగినపుడు కష్టం అవడం
4. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం
గర్భిణీ స్త్రీల యొక్క హీమోగ్లోబిన్ శాతం (హెచ్.బి. శాతం) 10 గ్రాముల కంటే తక్కువ ఉంటే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ బిళ్ళలు రోజుకి 1 చొప్పున 4 నెలలు తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. వైద్యుని సూచనలు లేకుండా ఈ టాబ్లెట్స్(బిళ్ళలు) వాడరాదు.
గర్భిణీ స్త్రీ 4వ నెల నుండి 100 మి.గ్రా. ఐరన్ మరియు 0.5 మి.గ్రా. ఫోలిక్ యాసిడ్ బిళ్ళలను రోజుకి 1 చొప్పున ఆహారంతోపాటు తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. వైద్యుని సూచనలు లేకుండా ఈ టాబ్లెట్స్(బిళ్ళలు) వాడరాదు.

నీళ్ళు

గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ చమట(స్వేదం)రావటం సహజమే. ఈస్ట్రోజన్‌ స్థాయిలు తగ్గి , ఉష్ణోగ్రత మార్పులకు సున్నితత్వం పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి . కొబ్బరి నీరు, నిమ్మరసం, ఫ్రూట్ జూస్లు ఎక్కువగా తీసుకోవాలి. దాని వల్ల మూత్రం ఇన్ఫెక్షన్ రాదు.

థైరాయిడ్ పరీక్ష

గర్భిణీ స్త్రీలలో అనేక హార్మోను మార్పుల వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ధైరాయిడ్ ఫంక్షన్‌ పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ పనిలో హెచ్చు తగ్గులు వలన చెమటలు పట్టె ఆస్కారము ఉన్నది. గర్భిణీగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్యవల్ల గర్భస్రావం జరగవచ్చు. లేదా కడుపులో శిశువు పెరుగుదలను అడ్డుకొంటుంది. కాబట్టి మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఒక సారి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

ఆహారం

గర్భిణీ స్త్రీలు ఎక్కువ పిండి పదార్ధాలని ఎక్కువ తీసుకోవాలి. వీటిలో ఎక్కువ ఫైబర్,విటమిన్లు, పోషకాలు ఉంటాయి.

పిండి పదార్ధాలు

పిండిపదార్దాలున్న పప్పులు, ధాన్యాలు, గోధుమలు, బియ్యం, జొన్నలు, రాగులు, బంగాళ దుంపలు, కర్రపెండలం, చిలగడదుంపలు, అరటి, బ్రెడ్, పండ్లు వీటితో పాటు మాంసకృత్తులు ఎక్కువగా వున్నఆహారం తీసుకోవాలి. పప్పులు, చిక్కుళ్ళు, వేరుశనగలు, సోయబీన్సు, పచ్చటి ఆకుకూరలు బాగా తీసుకోవాలి.

డెయిరీ పదార్ధాలు

 డెయిరీ పదార్ధాలు గర్భిణీ స్త్రీలకు ఎంతో శ్రేష్టం. అందుకే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటివి చక్కగా తీసుకోవాలి. పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటే బిడ్డకూ, గర్భానికి చాలా మంచిది. పెరుగు వల్ల జీర్ణాశయం లో ఇంఫెక్షన్స్ ఎమీ రాకుండా చూస్తుంది.

గుడ్లు

వీటిలో మీకు కావల్సినంతా ప్రోటీన్లు, అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శిశువు పెరుగుదలకి చాలా ముఖ్యం. గ్రుడ్లలో డజనుకు పైగా విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి.
చేపలు, మాంసము తినటం చాలా మంచిది. వీటిలో ఉండే క్రొవ్వు పదార్ధాలు మీకు మీ బిడ్డకు మంచి శక్తినిస్తాయి.

వేరుశెనగలు

ప్రతిరోజు గుప్పెడు వేరుసనగలు తింటే శరీరానికి సరిపడా మాంసకృత్తులు లభిస్తాయి. ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను(ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పొడిగించాలి.

మాంసాహారం

ఉడికించిన పదార్థాలను, పచ్చిగా ఉన్న (ఉడకని పదార్థాలను)విడివిడిగా జాగ్రత్తపరచాలి. స్పూన్స్, ప్లేట్స్, కత్తులు, కట్టింగ్ బోర్డులు వంటివి మాంసాహారాలను కట్ చేసినప్పుడు శుభ్రం చేసిన తర్వాత భద్రపరచాలి. లేదాంటే సాల్మొనెల్ల ఇతర హానికరమైన బ్యాక్టీరియా గర్భిణీ స్త్రీలకు హాని కలిగిస్తుంది.

వాకింగ్

గర్భిణీ స్త్రీలు చేసే పనులలో నడక ఉండాలి. గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే గర్భిణీ స్తీలు ఎక్కువ బరువు పనులు చేయకూడదు. ప్రత్యేకంగా నెలలునిండిన సమయంలో అస్సలు చేయకూడదు. అది కూడా డాక్టర్ సలహా ప్రకారమే నడుచుకోవాలి. ఇలా చిన్న చిన్న వ్యాయామాలు, వాకింగ్ చేయటం వల్ల సుఖ ప్రసవం జరుగుతుంది.

పెట్స్

పెట్స్ అంటే మీరు ఇంట్లో పెంచుకొనే కుక్కలు, పిల్లులూ వాటికి దూరంగా ఉండాలి. ఇంకా వాటిని శుభ్రం చేయకూడదు. ఎందుకంటే వాటిలో పారాసైట్స్ వంటివి ఇన్ఫెక్షన్ కు దారితీస్తాయి. అంతే కాకుండా ఈ సంక్రమణ వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ మెదడు, కళ్ళ మీద ప్రభావాన్ని చూపుతాయి.

నిద్ర

మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. నిద్రకు ఉపక్రమించే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి.

ఒత్తిడి

ప్రస్తుతం వయోపరిమితి లేకుండా అందరినీ బాధించేది ఒత్తిడి. ఇలా ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు. అయితే దీనికి మూలం గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి పడే టెన్షన్‌ వలన పుట్టబోయే బిడ్డలకు కూడా ఒత్తిడి సమస్య సంక్రమిస్తుంది.

కాస్మెటిక్స్ కు దూరంగా

గర్భిణీ స్త్రీలకు కొన్ని వాసనలు పడవు. అలాగే కొన్ని కాస్మోటిక్స్ కూడా చర్మానికి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కొన్ని రకాల కాస్మొటిక్స్ లో వివిధ రకాల కెమికల్స్ కలపడం వల్ల గర్భస్త శిశువు పై ప్రభావం చూపుతాయి.

ధూమపానం, మధ్యపానం

పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ దొరకదు. అందుచేత భోజనం తరువాత టీ కానీ కాఫీ కానీ తీసుకోకూడదు.

సెల్ ఫోన్ సంభాషణ

గర్భంతో ఉన్నప్పుడు భర్తకు దూరంగా,పుట్టింట్లో ఉండటం కాస్త కష్టమే. దీనితో ఆ ఎడబాటును పోగొట్టుకునేందుకు భర్తతో సెల్ ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడుతున్నారు. గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపై వివిధ రకాల పరీక్షలు జరిపిన తర్వాత పరిశోధించగా వారిలో 50శాతం మందికి ఫైగా రేడియేషన్‌ ప్రభావానికి గురెైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.రోజులో కావాల్సిన వారితో మూడు, నాలుగుసార్లు మాట్లాడవచ్చు అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలి. అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం అవుతోంది.

హై హీల్స్

హై హీల్స్ ఎత్తుమడమల చెప్పులు వాడకూడదు. కాళ్ళకు కరెక్ట్ గా సరిపోయే చెప్పులను, సౌకర్యవంతమైన చెప్పులను ధరించాలి. పాదాలకు ఎప్పుడూ రక్షణ కల్పించాలి. కాళ్ళు, పాదాలు వాపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.

షవర్ బాత్

శరీరానికి వేడి తగలకుండా జాగ్రత్త పడాలి. శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుకోవాలి. వేడి వేడి నీటితో స్నానం చేయకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలి.

బరువు

గర్భిణి స్త్రీలు తమ బరువును ఎప్పటికప్పుడు చూసుకోవాలి. తొమ్మిది నెలలో గర్భిణి-ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి. పెరగనిచో ఏదో సమస్య ఉన్నదని తెలుసుకోవాలి. కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చివరి నెలలో అకస్మాత్తుగా బరువు పెరగడం మంచిది కాదు. తల్లికాబోయే ఆమెకు మంచి పోషకాహారం ముఖ్యం. పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసము మొదలగు ఆహరం తీసుకోవాలి.

టాన్సిల్స్ సమస్యకు నివారణా మార్గాలు

టాన్సిల్స్ సమస్యకు నివారణా మార్గాలు



ఏదైనా తినాలంటే గుటక వేయలేకపోవటం, గొంతు ప్రదేశంలో వాచి చెప్పలేనంత నొప్పి రావటం.. ఇవే టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ గొంతులో వేర్వేరు ప్రదేశాల్లో ఎక్కడైనా రావచ్చు. ఇవి రెండూ ఒకే రకానికి చెందినవే అని చెప్పవచ్చు. అయితే టాన్సిల్స్‌ జీవితాంతం అలాగే ఉంటాయి. వయస్సు పరిణామ క్రమంలో వీటి సైజు కొంత వరకూ తగ్గే అవకాశం ఉండొచ్చు అని చేప్పవచ్చు. కానీ పూర్తిగా తగ్గిపోతాయని రూఢీగా చేప్పలేము.

టాన్సిల్స్


టాన్సిల్స్‌ విషయానికొస్తే సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ ఇది కూడా పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా పిల్లలు స్కూళ్లల్లోనో కలిసి ఆడుతున్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి బాక్టీరియా, వైరస్‌ల వంటివి సులభంగా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదేవిధంగా ‘స్రెప్టోకాకస్‌’ అనే బాక్టీరియా వల్ల గొంతు నొప్పితో ఈ సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా టాన్సిల్స్‌కు ఇన్ఫ్‌క్షన్లు వస్తే, ఆ ఇన్ఫెక్షన్‌ గొంతు నుండి శరీరంలోని ఇతర భాగాలకూ సోకే ప్రమాదం ఉంది. అందుకే టాన్సిల్స్‌ను నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదు.

అడినాయిడ్స్

అడినాయిడ్స్‌ విషయానికి వస్తే చిన్న వయస్సులో మొదలయ్యి, 12-13 ఏళ్ల వయసు వచ్చేసరికి మెల్లమెల్లగా కుంచించుకుపోతాయి. యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా అదృశ్యమైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అడినాయిడ్స్‌ సమస్య చిన్న పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అడినాయిడ్స్‌ వాపు వల్ల ముక్కు నుంచి చెవి వరకూ ఉండే గొట్టం మూసుకుపోయి వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కర్ణబేరి వెనుక నీరు చేరి, చెవి ఇన్ఫెక్షన్స్‌, వినికిడి లోపం వంటి పెద్ద సమస్యలు చెలరేగుతాయి. ఎదిగే వయస్సులో పిల్లలకూ తరచూ ఈ చెవి ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటే వారికి మాటలు రావడం కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సమస్య మరింత ఎక్కువగా బాధిస్తుంటే తగిన వైద్య సలహా మేరకు సర్జరీ ద్వారా తొలగించడమే మంచిదని తాజా అధ్యయనాల వెల్లడిస్తున్నాయి.

టాన్సిలైటిస్‌ గొంతునొప్పి ముఖ్యం

టాన్సిల్స్‌ వాపులో తీవ్రమైన గొంతునొప్పి, గుటక మింగుతుంటే నొప్పి రావచ్చు. టాన్సిల్స్‌ ఎర్రగా వాచి కనబడతుంటాయి. జ్వరం ఉండొచ్చు.‘టాన్సిలైటిస్‌’ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమైతే మెడ దగ్గర-దవడల కింద ఉండే లింఫ్‌ గ్రంథుల వాచి బిళ్లకట్టినట్టు ఉండొచ్చు. ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా గొంతు మారే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్‌ ముదిరితే టాన్సిల్స్‌ మీద, కొండనాలుక మీద చీము తెల్లగా కనబడుతుంటుంది. చాలాసార్లు టాన్సిల్స్‌తో పాటు అడినాయిడ్స్‌ కూడా ప్రభావితం కావచ్చు. రెండూ విడివిడిగా కూడా రావచ్చు.

టాన్సిల్స్ను గుర్తించేదెలా?

1. టాన్సిల్స్‌ వాపు, ఇన్ఫెక్షన్‌ బాహాటంగా కనబడుతుంది కాబట్టి వైద్యులు లక్షణాల ఆధారంగా నిర్ధారిస్తారు. మరీ తరచూ వేధిస్తుంటే గొంతు నుంచి దూదిపుల్లతో స్రావాలను సేకరించి, కల్చర్‌ పరీక్ష ద్వారా ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్న సూక్ష్మక్రిమి ఏమిటన్నదీ గుర్తిస్తారు.
2. అడినాయిడ్స్‌ బయటకు కనిపించదు కాబట్టి లక్షణాలను బట్టి దీనికి ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు అనిపిస్తే ముఖాన్ని పక్కకు ఉంచి ఎక్స్‌రే తీస్తారు. అడినాయిడ్‌ ఉబ్బితే.. ముక్కు వెనక ఉండే శ్వాసమార్గం మూసుకున్నట్టు కనిపిస్తుంది. లేదా అద్దంలోగానీ, ముక్కు ద్వారా పంపే వీడియో ఎండోస్కోపీ ద్వారాగానీ అడినాయిడ్స్‌ను చూడొచ్చు.

టాన్సిల్స్ కు సహజసిధ్ధ ఆయుర్వేద చికిత్స

చింత విత్తనం

మనకు చింతపండులో వుండే చింత విత్తనం దీనిపై అద్భుతంగా పనిచేస్తుంది. చింత విత్తనాన్ని బండ, లేదా సానరాయి మీద గంధం వచ్చేలా అరగదీయాలి. వచ్చిన గంధాన్ని గొతుక్రింద టాంసిల్స్ వాసి చేతికి తగిలే భాగమ్లో పట్టీలాగా వేయాలి. అలాగే ఒక పుల్లకు దూదిచుట్టి ,దానితో గంధాన్ని తీసుకుని నోరుతెరవమని చెప్పి టాంసిల్స్ కు తగిలేలా పూయాలి. ఇలా రోజుకు నాలుగైదుసారులు టాంసిల్స్ కు పూయాలి . వారము రోజులు చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. రోజురోజుకు ఫలితాలు మనకు తెలుస్తుంటాయికనుక మరికొన్ని రోజులు పట్టినా విడవకుండా వాడాలి. మనపెద్దలిచ్చిన వైద్యమిది. దీనివల్ల ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు.

అల్లోపతి చికిత్స?

టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ వాచి ఇన్‌ఫెక్షన్‌కు గురైన వెంటనే యాంటీబయాటిక్స్‌ వాడాల్సిన పని లేదు. ముందు 2-3 రోజుల పాటు విశ్రాంతితో పాటు జ్వరం, గొంతునొప్పి తగ్గేందుకు పారాసిటమాల్‌ వంటివి వైద్యులు ఇస్తారు. చాలాసార్లు వీటితోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ తగ్గకుండా మరింత తీవ్రం అవుతుంటే పెన్సిలిన్‌, అమాక్సిసిసిలిన్‌, కోఅమాక్సిక్లావ్‌ వంటి యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. వీటితో 5-6 రోజుల్లోనే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. వీటితో తగ్గుతున్నా,ఇదే సమస్య మళ్లీమళ్లీ పురావృతం అయ్యి వేధిస్తుంటే మాత్రం సర్జరీ అవసరమేమో వైద్యులు పరిశీలిస్తారు.

సర్జరీ ఎవరికి అవసరం?

1. తరచూ టాన్సిల్స్‌, అడినాయిడ్‌ ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారికి సర్జరీ అవసరమవుతుంది.ఏడాదికి మూడు సార్ల కంటే ఎక్కువగా దీంతో బాధపడుతుంటే సర్జరీ చెయ్యొచ్చని అమెరికా చెవిముక్కుగొంతు వైద్యుల సంఘం చెబుతోంది.
2. ఏడాదికి ఐదు, అంతకంటే ఎక్కువసార్లు వస్తుంటే సర్జరీ చెయ్యొచ్చని బ్రిటీషు వైద్యుల సంఘం సూచిస్తోంది.
3. ఏడాదికి 3-5 కంటే ఎక్కువసార్లు ఇన్‌ఫెక్షన్‌ వచ్చేవారికి టాన్సిల్స్‌ తొలగించే ఆపరేషన్‌ టాన్సిలెక్టమీ చెయ్యటం మేలు. తరచుగా జలుబు, ముక్కుదిబ్బడ, గురక, నిద్రలో అవరోధం వంటి అడినాయిడ్స్‌ వాపు లక్షణాలుంటే అడినాయిడ్‌తో పాటు టాన్సిల్స్‌ను కూడా తొలగిస్తారు. అలాగే ఏడాదికి 2-3 సార్లే అయినా బాధలు మరీ తీవ్రంగా వేధిస్తున్న వారికీ సర్జరీ చెయ్యాల్సి రావచ్చని వైద్యులు చేబుతున్నారు.

సంప్రదాయ పద్ధతి

టాన్సిల్స్‌ను తొలగించటానికి సంప్రదాయంగా ‘డైసెక్షన్‌ అండ్‌ స్నేర్‌’ పద్ధతి అనుసరిస్తారు. దీనిలో సాధారణ పరికరాలతోనే (కోల్డ్‌ స్టీల్‌) టాన్సిల్స్‌ను తొలగిస్తారు. ఇటీవలి కాలంలో లేజర్‌, కోబ్లేషన్‌, డిబ్రైడర్‌ వంటి రకరకాల పరికరాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.వీటితో నొప్పి-రక్తస్రావం వంటివి తక్కువని చెబుతుంటారు. కానీ వాస్తవానికి వైద్యపరమైన అధ్యయనాల్లో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లో చేసే సర్జరీనే మెరుగ్గా ఉంటోందని గుర్తించారు.
సంప్రదాయ పరికరాలతో చేసే సర్జరీకి అయ్యే ఖర్చు తక్కువ, నొప్పి తక్కువ, మత్తు ఎక్కువసేపు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా కొందరిలో సర్జరీ తర్వాత 5-7 రోజుల్లో రక్తస్రావమయ్యే అవకాశముంటుంది. సర్జరీ తర్వాత సమస్యలూ తక్కువగానే ఉంటున్నాయి. అడినాయిడ్స్‌ సర్జరీ కూడా- కోబ్లేషన్‌, మైక్రోడిబ్రైడర్‌, లేజర్‌ ప్రక్రియల ద్వారా చెయ్యొచ్చు. కానీ సంప్రదాయ పరికరాలతో (అడినాయిడ్‌ క్యూరెట్‌) చేసే పద్ధతే మెరుగని గుర్తించటం జరిగింది. దీంతో సర్జరీ చాలా కొద్ది సమయంలో పూర్తయిపోతుంది.

టాన్సిల్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారపదార్ధలు

1. ఆకుకూర

ఉడికించిన గ్రీన్ ఫీలీవెజిటెబుల్స్, ఆకుకూరలు వంటివి థ్రోట్ ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడుతాయి. ఆకుకూరలు బాగా ఉడికించి ఆరసంలో పెప్పర్ పౌడర్ వేసి గోరువెచ్చగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు గొంతునొప్పిని నివారిస్తుంది.

2.బంగాళదుంప

గొంతు నొప్పి నివారణకు చక్కగా పని చేసే వాటిలో ఇది మరొక ఆరోగ్యకరమైన పదార్ధం. బంగాళదుంపలను బాగా ఉడికించి పొట్టు తీసి, గరిటతో మెత్తగా చిదిమితే సరిపోతుంది.

3.అల్లం

టాన్సిల్స్ తగ్గించడానికి, గొంతు ఇన్ఫెక్షన్ కు ఇది మంచి గృహ చిట్క. గొంతునొప్పికి తక్షణ ఉపశమనం పొందడానికి కొద్దిగా తేనెలో అల్లం పౌడర్ లేదా అల్లం చూర్ణాన్ని కలుపుకొని సేవించాలి.

4. తేనె, నిమ్మ

టాన్సిల్ తగ్గించడానికి మరో మంచి గృహ చిట్క. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో, తగినంత తేనె, నిమ్మరసాన్ని కలుపుకుని త్రాగాలి.

5. ఇడ్లీ

సాధారణంగా ఉన్న ఇడ్లీ చాలా ఆరోగ్యకరం. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు మెత్తగా ఉండే ఇడ్లీని తినవచ్చు. సాంబార్, పచ్చడి వంటివి వాడకపోవడమే చాలా మంచిది.

6. పెరుగు

టాన్సిల్స్ ఉన్నప్పుడు చాలా మంది పెరుగు తినకూడదని దురాభిప్రాయం ఉంది. పెరుగు సాఫ్ట్ పుడ్ మ్రింగడానికి చాలా సులభంగా ఉంటుంది. గొంతునొప్పి మరియు దురద, గొంతు వాపు వంటివి నివారించడానికి అతి చల్లగా ఉండే పెరుగును తీసుకోకూడదు.

7. ఉడికించిన అన్నం

ఉడికించిన అన్నం మెత్తగా ఉండటమే కాకుండా మ్రింగడానికి సులభంగా ఉంటుంది. స్పైసీ రైస్ ప్రిపేర్ చేయడం కంటే ప్లెయిన్ రైస్ తినడం మంచిది. మరీ ప్లెయిన్ గా తినడం ఎలా అనుకొంటే టాన్సిల్స్ నివారణకు ఉపయోగపడే మసాలా దినుసులు(చెక్క, లవంగం వంటివి)కలుపుకోవచ్చు.

టాన్సిల్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. పాలు, పసుపు

రాత్రి పడుకునే ముందు వేడి పాలలో ఒక చెంచా పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల పాటూ తీసుకుంటే టాన్సిల్స్ తగ్గుతాయి.

2. ఉప్పు

టాన్సిల్స్ వల్ల వచ్చే నొప్పిని నియంత్రించటానికి ఉప్పు చక్కటి ఔషధం. కప్పు వేడి నీళ్లలో ఉప్పు వేసి కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతులో చేరిన బ్యాక్టీరియా నశిస్తుంది. నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.

3. పసుపు

టాన్సిల్స్ సమస్యను తగ్గించడంలో పసుపు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా పసుపు కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. చెక్క

ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో చెంచా దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి రోజూ రెండు లేదా మూడు పూటలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. గొంతులో వేధించే నొప్పి, వాపు కూడా తగ్గిపోతాయి.

5. నిమ్మరసం

టాన్సిల్స్ వాపుతో బాధపడుతున్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ విటమిన్ సి లభించే నిమ్మరసం మాత్రం టాన్సిల్స్ సమస్యకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు.. చక్కగా పనిచేస్తాయి. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసం తీసి, చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.

6. మిరియాలు

ఒక స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల తేనె తీసుకుని నాలుగు స్పూన్ల వేడినీళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు ఒక స్పూన్ తీసుకుంటే టాన్సిల్స్ తగ్గుతాయి.

7. తులసి

తులసి ఒక యాంటి ఇంఫ్లమటరీ గుణాలు ఉన్నది. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని తులసి ఆకులు వేశాక 10 నిమిషాలు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ద్రావణాన్ని వడగట్టి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. అవసరమైతే ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. ఇలా మూడు రోజుల పాటు మూడు సార్లు తీసుకుంటే టాన్సిల్స్ తగ్గి మంచి ఫలితం ఉంటుంది.https://www.youtube.com/channel/UCc7dzQTemnZh6h5hYa5I9JQ

rampa chodavaram