జొన్నలతో చేసే రొట్టెలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. అందుకే జొన్న పిండి, రవ్వ, గటక, అటుకలు.. ఇలా జొన్నలతో చేసిన ఎటువంటి ఆహారం తిన్నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో పాటుగా బాడీ ఎంతో స్ట్రాంగ్ గా మారుతుంది. జొన్న రొట్టెలు చేసుకుని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కింద తెలుసుకుందాం..
* బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నల్లో కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది.
* ఐరన్, ప్రోటీన్లు, పీచు పదార్థం వంటి బియ్యం, గోధుమల్లో దొరకని ఎన్నో పోషకాలు కేవలం జొన్నల్లోనే లభిస్తాయి.
* గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఫ్రీ ఆహారం జొన్న.
* ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి.
* శరీరంలో ఉండే చెడు కొవ్వుని తగ్గించే అరుదైన శక్తి జొన్న గింజల్లో ఉంది.
* ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నలతో పుష్కలంగా దొరుకుతుంది.
* నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు చాలా ఎక్కువగా ఉంది.
* జొన్న రొట్టెలు తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
* వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు జొన్న రొట్టె తినడం వల్ల తగ్గుతాయి.
No comments:
Post a Comment