Telugu universal news
Telugu universal news has best site on the world. health information, technical information, life style, upcoming news.
Monday, November 26, 2018
Saturday, November 17, 2018
Thursday, November 8, 2018
Sunday, December 31, 2017
ఎత్తైన తలదిండ్లు వాడితే ఆరోగ్యానికి కలిగే హాని ఏంటి?
చాలా మందికి తలకింద దిండు లేనిదే నిద్రపట్టదు. ఇలాంటి వారు ఆ సమయానికి ఏదో ఒకటి ఎత్తును తల కింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు. అలాంటి వారు చిన్నపాటి అనారోగ్య ఇబ్బందులకు గురవుతుంటారు. అందువల్ల దిండ్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. తలదిండ్లు మరీ పలుచగా ఉన్నా.. మరీ ఎత్తుగా ఉన్న వెన్నుముకకి ఇబ్బంది కలుగుతుంది.
మరీ పల్చగా ఉన్న దిండ్లను వాడినా.. లేదంటే బాగా ఎత్తైన దిండ్లని ఎంచుకున్నా... వీటివల్ల వెన్నెముకకి ఇబ్బంది. దీర్ఘకాలం ఇలానే పడుకుంటే వెన్నెముక, మెడపై భారం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా, వెల్లకిలా, బోర్లా ఈ రెండూ నిద్రపోవడానికి సరైన విధానాలు కావు.. ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవడం మంచి పద్ధతి. బరువుని ఎత్తేటప్పుడు వంగిపోయి అమాంతం ఎత్తడం కూడా మనలో చాలామంది చేసేదే. దీనివల్ల నడుము పట్టేస్తుంది. అలా కాకుండా మోకాళ్ల మీద కూర్చుని నిదానంగా, అదును చూసుకుని ఎత్తాలి.
మరీ పల్చగా ఉన్న దిండ్లను వాడినా.. లేదంటే బాగా ఎత్తైన దిండ్లని ఎంచుకున్నా... వీటివల్ల వెన్నెముకకి ఇబ్బంది. దీర్ఘకాలం ఇలానే పడుకుంటే వెన్నెముక, మెడపై భారం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా, వెల్లకిలా, బోర్లా ఈ రెండూ నిద్రపోవడానికి సరైన విధానాలు కావు.. ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవడం మంచి పద్ధతి. బరువుని ఎత్తేటప్పుడు వంగిపోయి అమాంతం ఎత్తడం కూడా మనలో చాలామంది చేసేదే. దీనివల్ల నడుము పట్టేస్తుంది. అలా కాకుండా మోకాళ్ల మీద కూర్చుని నిదానంగా, అదును చూసుకుని ఎత్తాలి.
వేడినీటిలో స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవచ్చా?
వేడినీటిలో స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవడం.. ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయకూడదు. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే.. ఉదర భాగంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలి. అయితే వేడినీటిలో స్నానం చేశాక.. శరీరాన్ని చల్లబరిచేందుకు అధికరక్తం చర్మానికి చేరుతుంది. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేస్తే.. రక్త ప్రసరణ చేతులు కాళ్లు వంటి భాగాలకు చేరుతుంది. అందుచేత ఉదర భాగంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. తద్వారా తీసుకున్న ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.
కాబట్టి స్నానం చేసిన అరగంట తర్వాత ఆహారం తీసుకోవాలి. అలాగే ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత స్నానం చేయాలి. ఆహారం తీసుకున్న వెంటనే పండ్లను తీసుకోకూడదు. ఇలా చేస్తే గ్యాస్‌తో పాటు అయోడిన్ శరీరంలో చేరుతుంది. అందుకే ఆహారం తీసుకున్న రెండు గంటలకు తర్వాతే పండ్లు తీసుకోవాలి. లేదా ఆహారం తీసుకోవడానికి గంట ముందు పండ్లు తీసుకోవచ్చు.
ఇదేవిధంగా ఆహారం తీసుకున్న వెంటనే టీ తాగడం చేయకూడదు. ఇలా చేస్తే అధిక స్థాయిలో ఆమ్లాలను శరీరంలో చేర్చినవారవుతాం. తద్వారా అజీర్తి తప్పదు. ఆహారం తీసుకున్న తర్వాత పొగతాగకూడదు. తద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే ఆహారం తీసుకున్నాక బెల్టును వదులు చేయడం కూడదు. ఇలా చేస్తే.. తీసుకునే ఆహారం వేగంగా పేగులకు చేరుతుంది. తద్వారా జీర్ణ ప్రక్రియ సజావుగా సాగదు. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించకూడదు. తద్వారా కడుపులో గ్యాస్, బ్యాక్టీరియా చేరుతుంది.
గ్యాస్ సమస్య నుండి ఉపశమనానికి ఇలా చేయండి..
జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరలు వాపునకు గురైనప్పుడు, పలు రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా లోనవడం వల్ల, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మద్యం సేవించడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలా వచ్చే గ్యాస్ సమస్యను పలు సింపుల్ టిప్స్ పాటించడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే గ్యాస్ సమస్య ఉండదు.
2. పుదీనా, చామంతి, రాస్ప్‌బెర్రీ రుచులలో ఉండే టీని తాగినా గ్యాస్ సమస్య బాధించదు.
3. పసుపు ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య ఇట్టే పోతుంది.
4. రోజూ ఉదయాన్నే పరగడుపున 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
5. గ్యాస్ సమస్యకు అల్లం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. లేదంటే 1 టీస్పూన్ అల్లం రసం తాగినా చాలు. సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
6. ఆలుగడ్డలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. దీన్ని రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య రాదు.
7. భోజనానికి ముందు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగాలి. లేదంటే వాటి రసం తాగినా చాలు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
8. దాల్చినచెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. భోజనానికి ముందు ఈ నీటిని తాగితే గ్యాస్ రాదు.
9. భోజనం చేశాక 2, 3 యాలకుల్ని అలాగే నమిలి తిన్నా గ్యాస్ రాదు.
10. రోజూ ఏదో ఒక సమయంలో కొబ్బరినీళ్లను తాగుతుంటే గ్యాస్ రాకుండా ఉంటుంది.
11. ఒక గ్లాస్ వేడి నీటిలో 3 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది.
12. రోజూ మజ్జిగలో నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) కలుపుకుని తాగినా గ్యాస్ సమస్య బాధించదు.
13. కొద్దిగా కొత్తిమీర తీసుకుని దాన్నుంచి రసం తీసి ఆ రసం తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. కొత్తిమీరను నేరుగా తిన్నా సరే ఈ సమస్య రాదు.
14. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో నల్ల మిరియాల పొడి వేసుకుని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది.
15. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఇంగువను వేసి కలిపి తాగితే గ్యాస్ బారి నుంచి బయట పడవచ్చు.
16. భోజనం చేశాక సోంపు, లవంగాలు, వాము నమిలి మింగాలి. దీని వల్ల కూడా గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు.
17. రోజూ వేడి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే గ్యాస్ సమస్య రాదు. తిన్న ఆహారం జీర్ణం సరిగ్గా అవుతుంది.
Subscribe to:
Comments (Atom)
-
మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండాలంటే? కొందరికి మూత్రానికి వెళ్తే మంట, మరికొందరికి మూత్రపిండాలలో ఇబ్బంది ఈ సమస్యలకు కారణం మీకు మూత్ర పిండాల ...
-
యువత ఆరోగ్యంగా ఉండాలంటే? మానవ జీవిత చక్రంలో అతి కీలకమైన వయస్సు యవ్వనం. అది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే యువత ...
-
జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరలు వాపునకు గురైనప్పుడు, పలు రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా లోనవడం వల్ల, దీర్ఘ...